దిల్ రాజు సపోర్ట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్ దర్శకులు

First Published 7, Jun 2019, 11:54 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా యువ దర్శకులను ప్రోత్సహించడంలో అయన ముందుంటారు. కెరీర్ మొదట్లో ఎక్కువగా కొత్త  దర్శకులతో సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఈ మధ్య ఆ గెట్ ను మూసేశారు. 

ఇక మళ్ళీ  తన ప్రొడక్షన్ స్కూల్ లో ఎదిగిన యువ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు. సాధారణంగా దిల్ రాజు అప్పట్లో తన ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఎవరైనా దర్శకులు మొదటి అవకాశంతో సక్సెస్ కొడితే రెండవసారి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.  అయితే మొత్తంగా దిల్ రాజు సపోర్ట్ తో పరిచయమైన దర్శకులపై లుక్కేద్దాం పదండి.

సుకుమార్: సుక్కు మొదటి సినిమా ఆర్య ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. దిల్ సినిమాకు అసిస్టెంట్ గా ఉన్న సుక్కు ఆ సమయంలో ఆర్య కథను డెవలప్ చేసి దిల్ రాజును  మెప్పించాడు. ఆ సినిమా సక్సెస్ అనంతరం మరో సినిమా దిల్ రాజుతోనే చేయాలి. కానీ సుక్కు చేయలేదు.

జగడం స్క్రిప్ట్ లో దిల్ రాజు కొన్ని మార్పులు అడిగినప్పటికీ సుక్కు మొండి పట్టుతో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దిల్ రాజు గ్రహించినట్టుగానే ఆడలేదు. ఆ తారువాత సుకుమార్ తన పొరపాటును తెలుసుకున్నారు.

బోయపాటి శ్రీను: భద్ర సినిమా తెరకెక్కించడానికి బోయపాటి అప్పట్లో చాలా కష్టపడ్డాడు. చాలా మంది హీరోలు ఆ కథ చేయనున్నారు. ఫైనల్ గా దిల్ రాజు నమ్మి కథలో కొన్ని మార్పులు చేయించి రవితేజకు ఫిక్స్ చేశాడు. ఆ సినిమా హిట్టయింది.

బొమ్మరిల్లు భాస్కర్: బొమ్మరిల్లు సినిమా చేసి ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్ దిల్ రాజు ప్రొడక్షన్ స్కూల్ లో కొన్నేళ్ళవరకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. బొమ్మరిల్లు తో సక్సెస్ అందుకొని నెక్స్ట్ పరుగు కూడా దిల్ రాజు సపోర్ట్ తోనే తెరకెక్కించాడు.

వంశీ పైడిపల్లి: దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతో మంచి అవకాశాన్ని అందుకున్నప్పటికీ వంశీ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ తరువాత బృందావనం  కథను నమ్మి దిల్ రాజు మరో అవకాశాన్ని ఇచ్చాడు. అనంతరం ఎవడు, మహేష్ మహర్షి కూడా దిల్ రాజు సపోర్ట్ తో తెరకెక్కించి వంశీ సక్సెస్ అయ్యాడు.

శ్రీకాంత్ అడ్డాల: కొత్త బంగారు లోకం సినిమాతో దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్ అనంతరం ఆయన ఇచ్చిన ధైర్యంతో ఐదేళ్లు కష్టపడి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ కథను అల్లాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

వాసు వర్మ: దిల్ రాజు ఏ స్టోరీ సిట్టింగ్ వేసినా వాసువర్మ ఉండాల్సిందే. అయితే అతని జడ్జిమెంట్ ను చాలా సార్లు నమ్మిన దిల్ రాజు నాగ చైతన్య ఎంట్రీ భారాన్ని అతనికి అప్పగించాడు. ఆ సినిమా తేడా కొట్టినప్పటికీ స్క్రిప్ట్ డిస్కర్షన్స్ లో వాసుకి అవకాశం ఇచ్చాడు. ఆరేళ్ల అనంతరం సునీల్ కృష్ణాష్టమి తో మరో అవకాశం ఇచ్చినప్పటికీ వాసువర్మ క్లిక్కవ్వలేకపోయారు.

వేణు శ్రీరామ్: ఓ మై ఫ్రెండ్ సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికీ ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చి నాని MCA సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమాను వేణు దిల్ రాజు సపోర్ట్ తోనే తెరకెక్కించనున్నాడు.

సతీష్ వేగేశ్న: ముందు రచయితగా సక్సెస్ అయినప్పటికీ మూడు సినిమాలు డైరెక్ట్ చేసి డిజాస్టర్స్ అందుకున్న సతీష్ కు శతమానం భవతి ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తరువాత కూడా శ్రీనివాస కళ్యాణం అని మరో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

loader