MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఛార్మికేమో ఫ్లాపులు, ఇలియానాకేమో పొగరు..అందుకే టాలీవుడ్ లో కనిపించకుండా పోయిందా, షాకింగ్ కామెంట్స్ 

ఛార్మికేమో ఫ్లాపులు, ఇలియానాకేమో పొగరు..అందుకే టాలీవుడ్ లో కనిపించకుండా పోయిందా, షాకింగ్ కామెంట్స్ 

పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. యువతకి నచ్చే విధంగా నాజూగ్గా ఆమె కనిపించడంతో ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ టైంలో ఇలియానానే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 10 2024, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. యువతకి నచ్చే విధంగా నాజూగ్గా ఆమె కనిపించడంతో ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ టైంలో ఇలియానానే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. ఇలియానా టాలీవుడ్ లో మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. 

26

ఎన్టీఆర్ తో ఆమె రాఖీ, శక్తి చిత్రాల్లో నటించింది. రాఖీ పర్వాలేదనిపించగా.. శక్తి డిజాస్టర్ గా నిలిచింది. రాఖీ చిత్రాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించారు. ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ ఇలియానా, ఛార్మిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి నచ్చిన హీరోయిన్లలో ఛార్మి ఒకరని కృష్ణ వంశీ ప్రశంసలు కురిపించారు. కానీ ఆమెకి వరుసగా ఫ్లాపులు ఎదురుకావడం దురదృష్టకరం అని అన్నారు. 

36

ఛార్మి ఎలాగైనా నటించగలదు. ఎలాంటి హావభావాలు అయినా పలికించగలదు. అలాంటి నటికి సక్సెస్ లేదు అంటే మనం ఏమి చేయలేం కదా అని కృష్ణ వంశీ అన్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో ఛార్మి శ్రీ ఆంజనేయం, చక్రం, రాఖీ లాంటి చిత్రాల్లో నటించింది. 

46

ఇక కృష్ణ వంశీ ఇలియానా గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను వర్క్ చేసిన అందరు హీరోయిన్లు నాతో ఫ్రెండ్లీ గా ఉంటారు. ఒక్క హీరోయిన్ తప్ప అని కృష్ణ వంశి పరోక్షంగా ఇలియానా గురించి ప్రస్తావించారు. ఆమెతో నేను చేసింది ఒకే ఒక్క చిత్రం అది రాఖీ. షూటింగ్ రెండవ రోజే ఆమె గురించి అర్థం అయింది. అసలు ఆ చిత్రంలోకి ఆమెని తీసుకోవడం నాకు ఇష్టం లేదు. 

56

కానీ ఆ టైంలో ఆమె సక్సెస్ ఫుల్ కావడంతో కమర్షియల్ అంశాలని దృష్టిలో పెట్టుకుని బలవంతంగా కొంతమంది ఈ ప్రాజెక్టు లోకి తీసుకువచ్చారు. ఆమె కూడా ప్రతి రోజు సెట్ లో కమర్షియల్ గానే బిహేవ్ చేస్తూ ఉండేది. ఆమె యాటిట్యూడ్ నాకు ఏమాత్రం నచ్చేది కాదు. దీనితో షూటింగ్ వరకు మాత్రమే ఆమెతో మాట్లాడేవాడిని. అంతకి మించి లేదు అని కృష్ణ వంశి అన్నారు. 

66

ఇలియానా బిహేవియర్ పై టాలీవుడ్ లో చాలా రూమర్స్ వచ్చాయి. అందులో ఇది ఒకటి. ఆమె టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పుడు చిన్నచూపుతో చూసేదని.. ఆమె దృష్టంతా బాలీవుడ్ పైనే అని అనేవాళ్ళు. ఆ కారణంతోనే ఇలియానాకి ఒక్కసారిగా టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోయాయి. అమర్ అక్బర్ ఆంటోనితో రీ ఎంట్రీ ఇచ్చినా ఆమెని ఎవరూ పట్టించుకోలేదు అనే ప్రచారం టాలీవుడ్ లో ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్
Recommended image3
Indraja Shankar: సరోగసీతో బిడ్డను కన్నానా? విమర్శలపై ఘాటుగా స్పందించిన ఇంద్రజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved