MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృష్ణ క్రేజ్ పోయిందని సినిమానే ఆపేసిన నిర్మాత, హీరోయిన్ గా విజయశాంతి.. సూపర్ స్టార్ రియాక్షన్ ఇదే

కృష్ణ క్రేజ్ పోయిందని సినిమానే ఆపేసిన నిర్మాత, హీరోయిన్ గా విజయశాంతి.. సూపర్ స్టార్ రియాక్షన్ ఇదే

సూపర్ స్టార్ కృష్ణకి క్రేజ్ లేదని ఓ స్టార్ ప్రొడ్యూసర్ ప్రారంభమైన సినిమాని ఆపేశారు. ఆ సినిమా ఏంటి ? ఆ తర్వాత కృష్ణ ఎలా రియాక్ట్ అయ్యారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 09 2025, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు
Image Credit : Asianet News

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు ఏడాదికి 17 సినిమాల్లోకి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణ డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు. కృష్ణ ఎంత బిజీగా ఉన్నా ఓపిగ్గా అన్ని సినిమాలు పూర్తి చేసేవారు. 90వ దశకం చివరికి వచ్చేసరికి కృష్ణ హీరోగా సినిమాలు చేయడం దాదాపుగా మానేశారు. చేసిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉండేవి.

25
ప్రేయసి రావే డైరెక్టర్ చంద్ర మహేష్ 
Image Credit : Asianet News

ప్రేయసి రావే డైరెక్టర్ చంద్ర మహేష్ 

 ప్రేయసి రావే లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చంద్ర మహేష్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రేమ కథ తీసుకుని వెళ్లి తాను రామానాయుడు గారికి వినిపించినట్లు చంద్ర మహేష్ తెలిపారు. కానీ రామానాయుడు గారు ఒక బెంగాలీ సినిమా చూసి దానిని తెలుగు రీమేక్ చేద్దాం అని అన్నారు. మరి నా దగ్గర లవ్ స్టోరీ ఉంది కదా సార్ అని అడిగా.. సరే అయితే ఈ బెంగాలీ సినిమాని వేరే డైరెక్టర్ చేయించుకుంటా.. నీ సినిమా తర్వాత చూద్దాం అని అన్నారు. 

Related Articles

Related image1
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
Related image2
రాజమౌళి సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్, ధైర్యమిచ్చిన స్టార్ హీరో గురించి జక్కన్న ఇలా..
35
రీమేక్ సినిమాకి రెడీ
Image Credit : Eenadu

రీమేక్ సినిమాకి రెడీ

ఈ విషయం వెళ్లి పోసాని కృష్ణ మురళి గారికి చెప్పా. రామానాయుడు గారితో అలా ఎందుకు అన్నావు. ఆ బెంగాలీ సినిమా రీమేక్ నువ్వే చేయి. లేకుంటే ఆయన నిన్ను దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత ఛాన్స్ ఇవ్వరు అని చెప్పారు. ఆ బెంగాలీ సినిమా తండ్రి కొడుకుల కథ సార్.. మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి సార్ అని చెప్పా. లేదు కథని నేను మారుస్తాను, నువ్వు దర్శకత్వం చేయి అని పోసాని అన్నారు. దీనికి రామానాయుడు గారు కూడా ఓకె చెప్పారు. 

45
కృష్ణ, విజయశాంతితో తొలి సినిమా ఛాన్స్
Image Credit : Social Media

కృష్ణ, విజయశాంతితో తొలి సినిమా ఛాన్స్

హీరోగా కృష్ణ గారిని అనుకున్నాం. తండ్రిగా కృష్ణ గారు వృద్ధుడి గెటప్ లో భారతీయుడు స్టైల్ లో చూపించాలని అనుకున్నాం. ఆయన భార్యగా విజయశాంతిని అనుకున్నాం. కృష్ణ గారికి చెబితే భలే ఉంది అయ్యా. చేద్దాం అని అన్నారు. ఒక కాలనీ సెట్ కూడా నిర్మించాం. కానీ ఇంతలో రామానాయుడు గారికి చాలా మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. తండ్రి కొడుకుల కథలు ఈ కాలంలో ఎక్కడ ఆడతాయి.. అవి ఫేడ్ అవుట్ అయిపోయాయి కదా అని అన్నారట. అదే సమయంలో కృష్ణ గారు హీరోగా నటించిన మానవుడు దానవుడు అనే సినిమా ఫ్లాప్ అయింది. 

55
కృష్ణకి ఇప్పుడు క్రేజ్ లేదు
Image Credit : our own

కృష్ణకి ఇప్పుడు క్రేజ్ లేదు

ఇప్పుడు కృష్ణకి కూడా క్రేజ్ లేదు. పైగా ఈ కథ బాగాలేదని చాలా మంది చెబుతున్నారు. కాబట్టి సినిమా ఆపేద్దాం అని రామానాయుడు గారు అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సెట్ కూడా నిర్మించిన తర్వాత కృష్ణ గారు ఏమంటారో అని టెన్షన్ పడ్డా. ఆయనకి విషయం చెబితే ఏం పర్వాలేదు అయ్యా.. దానిదేముంది ఇంకో సినిమా చేసుకో అని చాలా కూల్ గా చెప్పారు. ఆ తర్వాత తాను శ్రీకాంత్ హీరోగా ప్రేయసి రావే అనే సినిమా చేసినట్లు చంద్ర మహేష్ తెలిపారు. కృష్ణ గారి సినిమా కోసం నిర్మించిన కాలనీ సెట్ ని ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా కోసం వాడుకున్నారు అని చంద్ర మహేష్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related Stories
Recommended image1
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
Recommended image2
రాజమౌళి సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్, ధైర్యమిచ్చిన స్టార్ హీరో గురించి జక్కన్న ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved