MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ని అంటావా? , ‘మంగళవారం’డైరక్టర్ కి మండింది

ప్రభాస్ ని అంటావా? , ‘మంగళవారం’డైరక్టర్ కి మండింది

 ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అర్షద్ పై ఆన్ లైన్ వార్ ప్రకటించారు.  తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయమై ట్వీట్ చేసారు.

2 Min read
Author : Surya Prakash
Published : Aug 20 2024, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ టైమ్స్ లో తెలుగు నుంచి సూపర్ హిట్ అయిన  సినిమా ఏదీ అంటే కల్కి అని మొహమాటం లేకుండా చెప్పేయచ్చు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా, ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఎన్నో విభాగాల్లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే అందరూ మెచ్చుకున్న  ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అర్షద్ వార్సి మాట్లాడుతూ ...నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదని ప్రకటించాడు అర్షద్. అక్కడితో ఆగకుండా “నాకు చాలా బాధగా ఉంది. అతడు సినిమాలో ఎందుకు జోకర్ లా కనిపించాడు. నేను మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకున్నాను. ఓ మెల్ గిబ్సన్ ను ఊహించుకున్నాను. అతడ్ని ఎందుకు అలా తయారుచేశారు. ప్రభాస్ ను ఎందుకలా చేశారో నాకు అర్థం కాలేదు.”.

36
ajay bhupathi

ajay bhupathi


ఓ పాడ్ కాస్ట్ లో అర్షద్ వార్సి చేసిన  ఈ వివాదాస్పద వ్యాఖ్యలు  క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అర్షద్ పై ఆన్ లైన్ వార్ ప్రకటించారు.  తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయమై ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ఏముందంటే... "#Prabhas ప్రభాస్ ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాకు తీసుకెళ్లటం కోసం ఏదైనా చేస్తాడు..ఎంతైనా ఇస్తాడు, అతను మన జాతికి గర్వ కారణం ."

46
ajay bhupathi

ajay bhupathi


అలాగే "నీ కళ్లలో ఆ సినిమాపై అసూయ కనపడుతోంది. ఎందుకంటే నువ్వు ఫేడ్ అవుట్ అయ్యిపోయావు. నిన్నుఎవరూ పట్టించుకోవటం లేదు.  ప్రతీ దానికి ఓ పద్దతి, లిమిట్ అనేది ఉంటుంది, కానీ నువ్వు అవన్నీ అతిక్రమిస్తూ మాట్లాడావు," అన్నట్లుగా ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ని ప్రబాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. 

56


మరో ప్రక్క  నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ (Abhishek Agarwal) కూడా స్పందించారు. ఒక సినిమాను సమీక్షించడం లేదా విమర్శించడం మంచిదేనని, కానీ మాట్లాడే మాటలు సరైనవిగా ఉండాలన్నారు. ‘‘మాస్‌ ప్రేక్షకులు మెచ్చిన చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లు వసూలు చేసింది.. ప్రేక్షకులతో ప్రేమగా ‘డార్లింగ్‌’ అని పిలిపించుకునే నటుడు చేసిన మూవీకి ‘జోకర్‌’ అనే ముద్రవేశారు. సినిమాను రివ్యూ చేయొచ్చు లేదా విమర్శించవచ్చు. కానీ, మిస్టర్‌ అర్షద్‌ వార్సీ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రభాస్‌ గారిపై దాడి చేయడం కన్నా ఆయన తన కెరీర్‌పై దృష్టి పెడితే మంచిది. అంతేకాదు, భారతీయ సినిమా మరింత అభివృద్ధి చెందేలా ఏం చేయాలో చెబితే బాగుంటుంది’’
 

66


‘‘ప్రభాస్‌ ‘బాహుబలి’ సిరీస్‌తో దేశం గర్వపడేలా సినిమా తీసి, అంతర్జాతీయ వేదికపై మనల్ని నిలబెట్టారు. ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ హాలీవుడ్‌కు దీటుగా పనిచేస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ అదే బాటలో పయనించింది. ఇలాంటి వెక్కిరింపుల మాని, ఆ చిత్ర బృందానికి మనం మద్దతుగా నిలవాలి. మాకు ‘సర్క్యూట్‌’ (మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌లో అర్షద్‌ వార్సీ పాత్ర) కావాలి. ‘షార్ట్‌ సర్క్యూట్‌ కాదు’’ అని ఎక్స్‌ వేదికగా అభిషేక్‌ అగర్వాల్‌ పోస్ట్‌ చేశారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved