MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Khiladi: ఖిలాడీ బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేకింగ్.. టాలీవుడ్ లో కుర్రాళ్ళ కొత్త కలల రాణి, ఫోటోస్ వైరల్

Khiladi: ఖిలాడీ బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేకింగ్.. టాలీవుడ్ లో కుర్రాళ్ళ కొత్త కలల రాణి, ఫోటోస్ వైరల్

డింపుల్ హయతి ఖిలాడీ ప్రమోషన్స్ లో భాగంగా అందమైన ట్రెండీ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఈ డస్కీ బ్యూటీ తన బ్యాక్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫొటోస్ లో ఆమె ఇచ్చిన ప్రతి ఫోజు మతి పోగొట్టే విధంగా ఉంది. 

3 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Feb 08 2022, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

211

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల ద్రుష్టి ఆమెపై పడింది. దీనితో డింపుల్ కి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. 

311

ప్రస్తుతం డింపుల్ హయతి మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

411

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది. 

511

తాజాగా డింపుల్ హయతి ఖిలాడీ ప్రమోషన్స్ లో భాగంగా అందమైన ట్రెండీ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఈ డస్కీ బ్యూటీ తన బ్యాక్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫొటోస్ లో ఆమె ఇచ్చిన ప్రతి ఫోజు మతి పోగొట్టే విధంగా ఉంది. కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఆమె లుక్స్ ఉన్నాయి. మత్తు కళ్ళతో మాయచేస్తూ.. అందాలతో ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఫోజులని మాటల్లో వర్ణించలేం.

611

డింపుల్ హయతి గ్లామర్ డోస్ లో రెచ్చిపోతోంది. అందుకు ఖిలాడీ చిత్రమే ఉదాహరణ. ట్రైలర్ లో డింపుల్ హయతి బికినిలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక సాంగ్స్ లో రవితేజ పక్కన అందాలు ఆరబోస్తూనే, డాన్స్ తో అదరగొట్టింది. డింపుల్ హయతి కంప్లీట్ గా ఈ మూవీలో గ్లామర్ తో రెచ్చిపోయింది. ఆమె స్కిన్ షో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

711

ఓ ఇంటర్వ్యూలో డింపుల్ హయతి తన టాలీవుడ్ జర్నీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలు హద్దులు పెట్టుకుంటారు అని, ఇంతవరకే చేయగలరు అనే అపవాదు ఉంది. దానిని చెరిపివేయడానికే నేను వచ్చా. అందుకే ఎప్పుడూ ట్రెండీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు డింపుల్ పేర్కొంది. 

811

నేను కొంచెం రంగు తక్కువగా ఉన్నానని చాలా చిత్రాల్లో రిజెక్ట్ చేశారు. ఒకప్పుడు రంగు , అందానికి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతిభ చూసి కూడా అవకాశాలు ఇచ్చేవారు ఉన్నారు అని డింపుల్ పేర్కొంది. రంగు తక్కువని అవమానాలు ఎదుర్కొన్న డింపుల్ ఖిలాడీ తర్వాత టాలీవుడ్ టాప్ లీగ్ లోకి వెళ్లడం ఖాయం అనే అంచనాలు మొదలయ్యాయి. 

911

ఇటీవల విడుదలైన ఫుల్ కిక్కు, క్యాచ్ మీ సాంగ్స్ లో డింపుల్ మాస్ స్టెప్పులతో మోతెక్కిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై అమ్మడి హంగామా ఒక రేంజ్ లో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. పైగా డింపుల్ ప్రొఫెషనల్ డాన్సర్ కూడా. దీనితో ఖిలాడీ చిత్రంలో డింపుల్ పెర్ఫామెన్స్, గ్లామర్ పై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

1011

గద్దలకొండ గణేష్ చిత్రంలో సూపర్ హిట్టు స్పెషల్ సాంగ్ చేశాక అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాటన్నింటినీ వదులుకున్నా. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న టైంలో ఖిలాడీ మూవీలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీలో గ్లామర్ గా, ట్రెండీగా అలరిస్తాను అని డింపుల్ చెబుతోంది. 

1111

డింపుల్ హయతి 2017లో 'గల్ఫ్'చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
Recommended image2
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా
Recommended image3
రాంచరణ్ సినిమా కథ చెప్పకుండా దేవిశ్రీని దుబాయ్ లో వదిలేసి వెళ్ళిపోయిన సుకుమార్..అద్భుతం జరిగింది తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved