'భారతీయుడు 2' దెబ్బ : 'గేమ్ ఛేంజర్' పై వైల్డ్ డెసిషన్ తీసుకున్న దిల్ రాజు
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్' కావటంతో అంచనాలు బాగా ఉన్నాయి.
Dil raju
ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు-2 ఇటీవల విడుదలైంది. ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అందరీకీ నష్టాలు మిగిల్చింది. శంకర్ ఏంటి ఇంత పేలవమైన కథ,కథనంతో వచ్చారు. బోర్ గా ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. కమల్ హాసన్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చారు. ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇంపాక్ట్ ఖచ్చింగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై ఏ మేరకు పడుతుందా అని.
తన రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్(Game changer)పై ఫ్యాన్స్ కన్నా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు రామ్ చరణ్. అందుకే మొదట ఇచ్చిన డేట్స్ క్లాష్ అయినా, ఎక్కువ రోజులు బల్క్ గా మళ్లీ కేటాయించాల్సి వస్తున్నా, బడ్జెట్ పెరిగిపోతూ వస్తున్నా, షూటింగ్ డేస్ పెరిగిపోయినా రామ్ చరణ్ ఎక్కడా తొణకకుండా శంకర్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తన నుంచి వచ్చే సినిమాకు గ్లోబుల్ గా సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ సైతం త్యాగం చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో దిల్ రాజు సైతం ఈ చిత్రం భాద్యతలు పూర్తిగా శంకర్ పై పెట్టి వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ అప్ డేట్స్, రిలీజ్ డేట్ వివరాలు కూడా ఖచ్చితంగా చెప్పకుండా శంకర్ ఏమి చెప్తే అదే చెప్దామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా దిల్ రాజు సినిమా అంటే అన్నింటిలోనూ ఆయన హ్యాండ్ ఉంటుంది. అయితే ఈ సారి శంకర్ మీదే పెట్టేసారు. తను కేవలం ఫైనాన్స్ అందచేయటమే అన్నట్లు ఉండిపోయారు.
Game Changer
కానీ భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్ కావటంతో లెక్కలు మారిపోయాయి. శంకర్ డైరక్టర్ కావటంతో ఈ సినిమాపై ఇంపాక్ట్ పడతుంది. భారతీయుడు -2 డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు మెగా అభిమానులందరికి ఒకింత ఆందోళన మొదలైంది. భారతీయుడు -2 ప్రభావం గేమ్ ఛేంజర్ పై ఎంతవరకు ఉంటుందో అని నిర్మాత దిల్ రాజు కు కూడా చిన్నపాటి ఉత్కంఠగా ఉన్నారని సమాచారం. రెండు చిత్రాలకు ఒకేసారి సమాంతరంగా పనిచేయడం వల్ల సినిమా క్వాలిటీ అంతగా బాగా రాదనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో దిల్ రాజు ...ఈ ప్రాజెక్టుని ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇండియన్ 2 రిలీజ్ తర్వాత ఇమ్మీడియట్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. క్రిస్మస్ రిలీజ్ గా చెప్పుకొచ్చారు.అలాగే మరో ప్రక్క గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు మొదలెట్టారు. అన్నీ తనే పర్యవేక్షిస్తున్నారు. క్రిస్మస్ సీజన్ కు ఎట్టి పరిస్దితుల్లోనూ రావాల్సిందే అని ఆయన పనులు పరుగెట్టిస్తున్నారు. అలాగే బడ్జెట్ ఇంక పెరగకుండా,షూటింగ్ ఫోస్ట్ ఫోన్ అవ్వకుండా జాగ్రక్తలు పడుతున్నారు. దిల్ రాజు సీన్ లోకి రావటంతో డిస్టిబ్యూటర్స్ లో పూర్తి నమ్మకం వస్తోంది. ఎందుకంటే సినిమాకు ప్రాణం పెట్టే నిర్మాత దిల్ రాజు కాబట్టి,