MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను కాబట్టి బయటపడ్డా, ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు.. స్టార్ హీరోల ఫ్లాప్స్ పై దిల్ రాజు

నేను కాబట్టి బయటపడ్డా, ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు.. స్టార్ హీరోల ఫ్లాప్స్ పై దిల్ రాజు

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 29 2022, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది. తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రం వివాదాలకు కారణం అయింది. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు వారసుడు చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనితో దిల్ రాజుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. తెలుగు చిత్రాలకు నష్టం వాటిల్లేలా దిల్ రాజు ఒక డబ్బింగ్ చిత్రాన్ని తీసుకురావడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విమర్శలతో తన ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో డైరెక్ట్ గా దిల్ రాజు రంగంలోకి దిగారు. 

37

చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోందో చెబుతూ కుండబద్దలు కొట్టేశారు. టాలీవుడ్ లో కేవలం నిబంధనలు పేపర్లకి మాత్రమే పరిమితం. తేరా వెనుక ఎవరి అజెండాలు వాళ్ళకి ఉంటాయి. అందరూ చేసేది వ్యాపారమే అని దిల్ రాజు అన్నారు. కానీ అందరికి టార్గెట్ గా మారుతోంది మాత్రం నేనే. అందుకే నా వైఖరి మార్చుకోవాలనుకుంటున్నా. 

47

వారసుడు విషయంలో అనవసర రాద్ధాంతం జరుగుతోంది. నా గురించి అందరికి తెలిసింది కొంత మాత్రమే. చిత్ర పరిశ్రమలో నేను ఎన్ని రిస్క్ లు చేసానో ఎవరికీ తెలియదు. లోపల జరిగే విషయాలు సగం సగం మాత్రమే బయటకి వస్తాయి. నిర్మాతగా సినిమాలు చేస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా ఫ్యాన్సీ అమౌంట్ కి చిత్రాలు కొంటున్నా. 

57

మగధీర సాధించిన దానికంటే మించి బాహుబలి చిత్రాన్ని అమ్మితే నేను కొన్నా. నచ్చితే ఎంత దూరం అయినా వెళతా. ఆ క్రమంలో అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాల వల్ల డిస్ట్రిబ్యూటర్ గా చాలా నష్టపోయి. ఆ రెండు చిత్రాలు బాగా దెబ్బ తీశాయి. ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకుని ఉంటారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయి ఉంటారు. నేను కాబట్టి తట్టుకుని నిలబడగలిగా అని దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

67

వారసుడు విషయంలో వివాదం ఎందుకో అర్థం కావడం లేదు. నైజాంలో కూడా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించిన మైత్రి మూవీస్ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తా. అయితే నా విలువ వాళ్ళకి మున్ముందు తెలుస్తుంది అని దిల్ రాజు పేర్కొన్నారు. 

77
Dil raju

Dil raju

సంక్రాంతికి రెండు మూడు చిత్రాలు పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది తప్పదు. ఎందుకంటే సంక్రాంతి సినిమా సీజన్. మూడు చిత్రాలు బావుంటే మూడింటికి కలెక్షన్స్ వస్తాయి అని దిల్ రాజు అన్నారు. నేను తెలుగు ప్రొడ్యూసర్ ని, వంశి పైడిపల్లి తెలుగు డైరెక్టర్.. కాబట్టి వారసుడు విషయంలో వివాదం అనవసరం అని దిల్ రాజు అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
AK47: ఆదర్శ కుటుంబంలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి పాత్రలివే.. ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే
Recommended image2
Dhanush Net Worth: 150 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు.. ధనుష్ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!
Recommended image3
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved