- Home
- Entertainment
- Major: హీరో, దర్శకుడి మధ్య విభేదాలు..? కారణం తెలిస్తే షాక్ ? ఇండస్ట్రీలో హాట్ టాపిక్
Major: హీరో, దర్శకుడి మధ్య విభేదాలు..? కారణం తెలిస్తే షాక్ ? ఇండస్ట్రీలో హాట్ టాపిక్
`మేజర్` సినిమాని ఇటీవల దేశం మొత్తం బ్రహ్మరథం పట్టింది. కలెక్షన్ల పరంగానూ భారీగా వసూలు చేసింది. కానీ ఇప్పుడు చిత్ర హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

26/11 ముంబయి దాడుల ఘటనలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్(Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా `మేజర్`(Major). ఇందులో మేజర్ సందీప్ పాత్రలో అడవి శేషు(Adivi Sesh) నటించారు. `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క(Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. ప్రకాష్‌రాజ్, రేవతి ప్రధాన పాత్రల్లో సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది.
కేవలం 15కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. దాదాపు ముప్పై కోట్ల బిజినెస్‌తో థియేటర్లోకి వచ్చిన ఈసినిమాకి సుమారు 65కోట్ల కలెక్షన్లు వచ్చాయి. థియేట్రికల్‌గా, ఓటీటీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని రకాలుగా లాభాలను సాధించింది. అడవి శేషు కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరింది. `విక్రమ్` కలెక్షన్ల సునామీని తట్టుకుని నిలబడింది. దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రసారమవుతుంది. అక్కడ కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ఈనేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతుంది. హీరో అడవి శేషు, దర్శకుడు శశికిరణ్ తిక్కల మధ్య విభేదాలు తలెత్తాయనేది టాక్. అంతకు ముందు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు వీరిద్దరు. `గూఢచారి`, `మేజర్`తో విజయాలతో హిట్ కాంబినేషన్ అనే ముద్ర ఉంది. నెక్ట్స్ కూడా ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు.
అడవిశేషు, శశికిరణ్ తిక్క కలిసి `గూఢచారి` సీక్వెల్ `గూఢచారి 2` చేయబోతున్నారు. ఈ కథపై కూడా దర్శకుడు చాలా రోజులుగా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని కూడా ప్రకటించారు. సడెన్‌గా మధ్యలో అడవిశేషు `మేజర్` ప్రాజెక్ట్ ని తీసుకోవడం, అది మహేష్ బాబు వద్దకు వెళ్లడం, ఆ తర్వాత సినిమా రేంజ్ మారిపోవడం, తనకి కంఫర్ట్ గా ఉండే దర్శకుడు శశి మాత్రమే అని భావించిన అడవిశేషు ఆయన్ని పట్టుబట్టి తీసుకోవడం జరిగిందట.
కానీ సినిమా విడుదల తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమా హిట్ టాక్ వచ్చాక హీరో అడవిశేషు.. దర్శకుడిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అడవిశేషునే తీసుకున్నారని, తనకు ఏమాత్రం ఇవ్వడం లేదని దర్శకుడు హర్ట్ అయినట్టు సమాచారం. సినిమా విడుదలయ్యాక చాలా చోట్లకి యూనిట్ ప్రమోషన్‌లో భాగంగా తిరిగారు. అందులో చాలా సందర్భాల్లో దర్శకుడు కనిపించలేదు. పైగా యూనిట్‌ని అభినందించే ఈవెంట్లలోనూ దర్శకుడు తక్కువగానే కనిపించారు.
ఈ విషయంలోనే శశికిరణ్ తిక్క హార్ట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు సినిమా షూటింగ్ టైమ్‌లోనూ హీరో అడవిశేషు బాగా ఇన్‌వాల్వ్ అయ్యారని వినిపించింది. నిజానికి తాను నటించే చిత్రాల్లో అడవిశేషు కచ్చితంగా ఇన్‌వాల్వ్ అవుతుంటాడు. రైటింగ్ సైడ్ ఆయన ఇన్‌వాల్వ్ మెంట్ ఉంటుందని, సీన్లు బాగా వచ్చేందుకు ఆయన వర్క్ చేస్తారని వినిపించే మాటే. `మేజర్` విషయంలో అది మరింత ఎక్కువగా ఉండిందని, తన పాత్ర హైలైట్ కావడం కోసం ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారని, ఈ విసయంలో దర్శకుడిని కూడా పక్కన పెట్టినట్టు సోషల్ మీడియాలో వినిపించే మాట. దానికితోడు రిలీజ్ తర్వాత దక్కే ప్రశంసల్లోనూ దర్శకుడికి క్రెడిట్ రాకపోవడంతో ఆయన ఫీలయ్యారని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని అంటున్నారు.
తాజాగా దర్శకుడు చిత్ర బృందంలోని కొంత మంది ప్రముఖులకు, ఇతర సినీ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి అడవిశేషు మాత్రం హాజరు కాలేదు. ప్రకాష్ రాజ్‌తోపాటు సిద్ధు జొన్నలగడ్డ, అభిజిత్, నాగవంశీ, నవీన్ ఎర్నేని వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారట. కొంత మంది మీడియా ప్రముఖులను కూడా దర్శకుడు ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. ఇందులో హీరో మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో దీన్ని ప్రమోట్ చేసేందుకు అడివిశేషు వెళ్లారని,ఆ కారణంగా రాలేదని అంటున్నారు.
మరి కారణమేదైనా `మేజర్` హీరో, దర్శకుడి మధ్య విభేదాలనే విషయం ఇప్పుడు అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతుంది. నెక్ట్స్ వీరిద్దరు కలిసి చేయబోయే `గూఢచారి2`పై ఈ ప్రభావం ఉంటుందా? ఆ సినిమాకి దర్శకుడు మారే అవకాశం ఉంటుందా? అనేది మరింత హాట్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.