MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Posani krishna Murali: పోసాని ఎత్తుకుని పెంచిన బుడ్డోడు.. మహేష్,ప్రభాస్,ఎన్టీఆర్ లతో బ్లాక్‌ బస్టర్స్.. ఆ స్టార్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Posani krishna Murali: పోసాని ఎత్తుకుని పెంచిన బుడ్డోడు.. మహేష్,ప్రభాస్,ఎన్టీఆర్ లతో బ్లాక్‌ బస్టర్స్.. ఆ స్టార్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Posani krishna Murali: టాలీవుడ్ స్టార్ నటుడు, రైటర్, దర్శకుడు పోసాని కృష్ణమురళి మేనల్లుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అని మీకు తెలుసా? మహేష్ బాబు, ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిల్మ్ ఇండస్ట్రీలో బంధువులు ఎక్కువ..
Image Credit : our own

ఫిల్మ్ ఇండస్ట్రీలో బంధువులు ఎక్కువ..

ఫిల్మ్ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న బంధుత్వాలు అందరికి తెలియదు. ఆడియన్స్ కు తెలిసినవి చాలా తక్కువ. కానీ తెలియని తారల బంధాలు చాలా ఉన్నాయి. నాగార్జున, వెంకటేష్ బావా బామ్మర్దులు, విజయశాంతి, విజయ నిర్మల, జయసుధ దగ్గరి బంధువులు.. ఇలా ఆడియన్స్ కు తెలియని బంధుత్వాలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. స్టార్ రైటర్ పోసాని కృష్ణమురళీ గురించి అందరికి తెలిసిందే. ఆయన సొంత మేనల్లుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అని ఎంత మందికి తెలుసు. ఆయన ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చాడని మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోసాని దగ్గర పెరిగిన కొరటాల శివ..
Image Credit : Asianet News

పోసాని దగ్గర పెరిగిన కొరటాల శివ..

పోసాని మేనల్లుడు ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. అవును కొరటాల స్వయానా పోసాని కృష్ణమురళీ మేనల్లుడు. ఆయన దగ్గరే పెరిగాడు కూడా. ఈ విషయాన్ని స్వయంగా పోసాని ఓ సినిమా ఈవెంట్ లో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. '' కొరటాల స్వయానా నా మేనల్లుడు. నాతో పాటే ఉండేవాడు. నా పెళ్లి చూపులకు కూడా వాడిని ఒక్కడినే తీసుకెళ్లాను.. ఎలా ఉందిరా అమ్మాయి అని అడిగాను.. సూపర్ గా ఉంది మామయ్య అన్నాడు. ఏం ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసుకున్నాను. 50 పర్సంట్ నా పెళ్లాన్ని నిమ్మితే.. మరో 50 పర్సంట్ కొరటాలను నమ్మాను. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. '' అని కామెంట్స్ చేసి అందరిని నవ్వించారు పోసాని.

Related Articles

Related image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Related image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
35
ఫిల్మ్ ఇండస్ట్రీలో పోసాని ప్రయాణం..
Image Credit : our own

ఫిల్మ్ ఇండస్ట్రీలో పోసాని ప్రయాణం..

పోసాని కృష్ణమురళి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరంలేదు.. తెలుగు పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా..మల్టీ టాలెంట్ తో సత్తా చాటారాయన. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన పోసాని ఆపరేషన్ ధుర్యోధన వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెంటల్ కృష్ణ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. పోసానికి ఓ వర్గం అభిమానులు ఉన్నారు. వందల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టిగా, కమెడియన్ గా మెప్పించారు.

45
రాజకీయాల్లో వివాదాస్పదుడిగా..
Image Credit : twitter

రాజకీయాల్లో వివాదాస్పదుడిగా..

సినిమాల్లో పుల్ బిజీగా ఉండగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పోసాని...వైఎస్ జగన్ వీరాభిమాని. వైఎస్పార్ సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేసిన పోసాని.. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పోసాని దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా వెలుగు వెలుగుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

55
ప్రభాస్, మహేష్ , ఎన్టీఆర్ లకు హిట్లు ఇచ్చిన దర్శకుడు..
Image Credit : Asianet News

ప్రభాస్, మహేష్ , ఎన్టీఆర్ లకు హిట్లు ఇచ్చిన దర్శకుడు..

ఇక పోసాని మేనల్లుడు కొరటాల శివ రైటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ప్రభాస్ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమాతో కొరటాలకు తిరుగులేని పేరు వచ్చింది. అప్పటికి ప్లాప్ సినిమాలతో ఇబ్బందుల్లో ఉన్న మహేష్ బాబుకు భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు కొరటాల. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ , దేవర లాంటి హిట్లు కొట్టిన ఆయన.. చిరంజీవి ఆచార్యతో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణతో మూవీ చేస్తున్నాడు కొరటాల శివ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagabandham Day 1 Collections: నాగబంధం మూవీకి దారుణమైన కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఆడుకున్న శౌర్య-ఇరుక్కున్న పారు-సూరజ్ గురించి కార్తీక్ ఆరా
Recommended image3
Rao Bahadur 1 Day Collections: రావు బహదూర్‌ ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు.. సత్యదేవ్‌ మూవీ సక్సెస్‌ టార్గెట్‌ ఎంతంటే?
Related Stories
Recommended image1
Sr NTR: ఎన్టీఆర్ ను ఎదిరించి మాట్లాడే దమ్మున్న మొనగాడు ఎవరో తెలుసా? బాలకృష్ణ చెప్పిన రహస్యం..
Recommended image2
560 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు, సొంత వ్యాపారాలతో మహా రాణిలా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved