'దేవర' పైనా , శంకర్ లీగల్ యాక్షన్ తీసుకుంటానంటోంది?ఏంటీ రచ్చ
ఓ లేటెస్ట్ మూవీ ట్రైలర్‌లో చూసి కలత చెందా. నవలలోని సీన్స్‌ను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ..
Devara, shankar, velpari novel, ntr
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచారు. తాజాగా ఈ చిత్రం రెండో ట్రైలర్ రిలీజైంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో ఈ ట్రైలర్ అందుబాటులో ఉంది. అయితే అదే సమయంలో శంకర్ కాపీ రైట్స్ నిమిత్తం కేసు పెడతానంటూ ప్రకటన వచ్చింది.
ఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్‌లోనూ ఓ ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్.. ఇలా ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లోనైనా వినియోగించడం మానుకోండి అనంటంతో మీడియా లో ఓ వర్గం దృష్టి దేవరపై వెళ్లింది.
Director Shankar
ప్రముఖ దర్శకుడు శంకర్ చాలా సీరియస్ అయ్యి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని శంకర్ (Shankar) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా అంతకంటే ముందే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ విడుదలయిన కాసేపటిలోనే తమిళ దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా చిచ్చురేపింది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ట్రైలర్ చూసాను, సీన్స్ వాడేసారనటంతో దేవర మీదకే వెళ్లింది.
Shankar Copy Rights Issue
‘‘వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల ‘నవ యుగ నాయగన్ వేళ్ పారి’ కాపీరైట్స్ నావే. నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్‌ను.. ఓ లేటెస్ట్ మూవీ ట్రైలర్‌లో చూసి కలత చెందా.
నవలలోని సీన్స్‌ను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఏ సినిమా ట్రైలర్‌లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్ వెల్లడించలేదు.
Director Shankar
శంకర్ పెట్టిన ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో క్లారిటీగా చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. దేవరను అనవసరంగా బ్లేమ్ చేస్తూ యాంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
కొందరు నెటిజన్లు అయితే శంకర్ చేసిన ట్వీట్.. ‘కంగువా’ మూవీ గురించి అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. కానీ ‘కంగువా’ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. కేవలం టీజర్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ‘దేవర’ గురించే శంకర్ ట్వీట్ వేసారంటున్నారు. అయితే శంకర్ స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ ఈ చిచ్చు చల్లారదు.
director Shankar got trolled after kamal haasan movie indian 2 release
శంకర్.. సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కించిన భారతీయుడు 2తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. శంకర్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణి కథానాయిక. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా సినిమా డిసెంబరులో విడుదల కానుంది.
Shankar Movies
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' విషయానికి వస్తే... రీసెంట్ గా ముంబై వేదికగా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ట్రైలర్‌కు మంచి మార్కులే పడ్డాయి.
ఓవర్సీస్‌లో కూడా దేవర క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా దేవర నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి.
దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.