ఒక్కటైన దియా మీర్జా- వైభవ్‌ రేఖీ.. మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌

First Published Feb 15, 2021, 8:25 PM IST

నటి దియా మీర్జా పెళ్లి ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో జరిగింది. సోమవారం వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దియా రెండో పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. మ్యారేజ్‌ అనంతరం వీరిద్దరు బయటకు వచ్చి మీడియాకి పోజులిచ్చారు. స్వీట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దియా-వైభవ్‌ రేఖీల పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.