ఢీ వేదికపై లేడీ డాన్సర్ తలకు తీవ్ర గాయం.. షాక్ లో జడ్జెస్!
First Published Apr 8, 2021, 12:29 PM IST
తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 13సీజన్స్ గా ఢీ తిరుగులేని డాన్స్ రియాలిటీ షోగా కొనసాగుతుంది. ఢీ వేదిక ద్వారా అనేక మంది టాలెంటెడ్ డాన్సర్స్, టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్స్ గా సెటిల్ అయ్యారు.

ఇక కొన్ని సీజన్స్ నుండి ఢీ షోకి రొమాన్స్, కామెడీ కూడా కలిపి సరికొత్తగా షోని నిర్వహిస్తున్నారు. రష్మీ గౌతమ్, సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్ వంటి వారు ఢీ షోకి మరింత ఆదరణ తేవడంలో సక్సెస్ అయ్యారు.

ఎప్పటిలాగే లేటెస్ట్ ఎపిసోడ్ సైతం అనేక ఆసక్తికర విషయాలతో ముస్తాబు అయ్యింది. సుధీర్ పై హైపర్ ఆది పంచ్ ల వర్షం కురిపించాడు.

సాయంత్రం అయితే సుధీర్ వేట మొదలవుతుందని, ఎవరికైనా అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. సుధీర్ మాత్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటాడు, అని హైపర్ ఆది జోక్స్ పేల్చాడు.

ఎవరి జీవితంలో అయినా మలుపు ఉంటాయి. సుధీర్ జీవితంలో మాత్రం కేవలం తలుపులే ఉంటాయని చెప్పడంతో జడ్జెస్ అందరూ పక్కున నవ్వేశారు.

మరోవైపు రష్మీ.. అసలు షో నడుస్తుందే మావలన అంటూ ప్రదీప్ ని ప్రశ్నించింది. అవును... ఒకప్పుడు షో పరిగెత్తేది, మీ వలన నడుస్తుంది. ఇంకొన్నాళ్లు పోతే పాకుతుంది.. అంటూ ప్రదీప్, రష్మీకి ఝలక్ ఇచ్చాడు.

ఇలా సరదా సరదాగా సాగుతున్న షోలో ఓ లేడీ డాన్సర్ వేదికపై నుండి పడిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. డాన్స్ చేస్తూ లేడీ డాన్సర్ స్టేజ్ పై నుండి క్రింద పడిపోయారు.

వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి యూనిట్, పైకి లేపే ప్రయత్నం చేశారు. ఆమె తలకు కూడా గాయమై, రక్తం కారుతున్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది.
