- Home
- Entertainment
- బేబీ బంప్ చూపిస్తూ పింక్ గౌన్ లో మెరిసిపోతున్న పూర్ణ.. కడుపులో బిడ్డ గురించి ఎమోషనల్ గా..
బేబీ బంప్ చూపిస్తూ పింక్ గౌన్ లో మెరిసిపోతున్న పూర్ణ.. కడుపులో బిడ్డ గురించి ఎమోషనల్ గా..
త్వరలో పూర్ణ, షానిద్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. గత ఏడాది జూన్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రస్తుతం పూర్ణ నిండు గర్భిణి.

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ పూర్ణ మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది.
అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ షోలో అందరిని ఆకర్షిస్తోంది పూర్ణ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది .
గత ఏడాది పూర్ణ తన స్నేహితుడు షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ తాను గర్భవతిని అని ప్రకటించింది. అంటే త్వరలో పూర్ణ, షానిద్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
గత ఏడాది జూన్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రస్తుతం పూర్ణ నిండు గర్భిణి. దీనితో ఇటీవలే ఆమె సీమంతం ఘనంగా జరిగింది. తాజాగా పూర్ణ తన బేబీ బంప్ చూపిస్తూ లాంగ్ పింక్ గౌన్ లో మెరుపులు మెరిపించింది.
మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ.. గర్భంపై చేయి పెట్టుకుని తన బిడ్డ తాకిడిని పూర్ణ ఆస్వాదిస్తోంది. పింక్ గౌన్ లో ఆమె ఇచ్చిన ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎంతో అందంగా ఉన్న ఈ ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి.
పూర్ణ తన కడుపులో బిడ్డ గురించి ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది. లైఫ్ లో జరిగే అతి పెద్ద మిరాకిల్ ఏంటంటే.. మన లోపల ఇంకా లైఫ్ పెరడగం అని పేర్కొంది. పూర్ణ నిండు గర్భంతో ఇస్తున్న ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా పూర్ణ గత ఏడాది దృశ్యం 2, అఖండ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం పూర్ణ నాని దసరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని తిరిగి నటిగా మరో ఇన్నింగ్ ప్రారంభించబోతోంది పూర్ణ. అభిమానులంతా పూర్ణ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని విష్ చేస్తున్నారు.