- Home
- Entertainment
- ఫారెన్ వీధుల్లో సరికొత్తగా చక్కర్లు కొడుతున్న దీపికా పిల్లి.. మాజీ `ఢీ` భామ ఎంత స్టయిలీష్‌గా ఉందో..
ఫారెన్ వీధుల్లో సరికొత్తగా చక్కర్లు కొడుతున్న దీపికా పిల్లి.. మాజీ `ఢీ` భామ ఎంత స్టయిలీష్‌గా ఉందో..
`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి చాలా రోజుల తర్వాత మళ్లీ క్రేజీగా మెరిసింది. ఆమె ఫారెన్‌లో తిరుగుతూ కనిపించింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

`ఢీ` షోతో పాపులర్ అయ్యింది దీపికాపిల్లి. యాంకర్‌గా మెప్పించింది. తనదైన క్యూట్‌నెస్‌తో అలరిస్తుంది. నెటిజన్లకి ఆమె విజువల్ ట్రీట్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా పలకరించింది. తన కొత్త అందాలను ఆవిష్కరిస్తూ మైమరపించింది.
గతేడాది ప్రారంభంలోనే వరుసగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్ చేసింది దీపికా పిల్లి. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మళ్లీ సందడి చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది.
ఇందులో ఫారెన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది దీపికా. జీన్స్, టీషర్ట్ లో కనిపించింది. తన నాభి అందాలను, నడుము వొంపులను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. అదే సమయంలో సూపర్‌స్టయిలీష్ లుక్‌లో కనిపించింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
దీపికా పిల్లి టిక్ టాక్ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకి ఆ యాప్ లైఫ్ ఇచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకి `ఢీ` డాన్స్ షోలో పాల్గొనేలా చేసింది. ఇందులో రష్మి గౌతమ్‌తో కలిసి సందడి చేసింది. హైపర్ ఆదితో కలిసి పులిహోర కలిపి ఆకట్టుకుంది.
కానీ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. ఒక్క సీజన్‌కే పరిమితం చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు యాంకర్‌గా కామెడీస్టార్స్, కామెడీ ఎక్స్ ఛేంజ్ షోలోనూ చేసింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి టీవీ షోస్ లేవు. దీంతో ఈ అమ్మడిలో ఉత్సాహం తగ్గింది. సోషల్ మీడియాలోనూ జోరు తగ్గింది. అడపాదడపా కనిపిస్తుందీ దీపికా పిల్లి.
ఇప్పుడు మరోసారి మెరిసింది. విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తన అందాలను ఆవిష్కరిస్తూ ఈ పని చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.