- Home
- Entertainment
- బాపు బొమ్మలా ‘ఢీ’ బ్యూటీ పరువాల విందు.. లెహంగా, వోణీలో మైమరిపిస్తున్న కేరళ కుట్టి పూర్ణ..
బాపు బొమ్మలా ‘ఢీ’ బ్యూటీ పరువాల విందు.. లెహంగా, వోణీలో మైమరిపిస్తున్న కేరళ కుట్టి పూర్ణ..
ట్రెడిషనల్ లుక్ కు పెట్టింది పేరు ‘ఢీ’ బ్యూటీ, నటి పూర్ణ (Poorna). సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా అందాల ఆరబోస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్ల మతినిపోగొడుతున్నాయి.

కేరళ బ్యూటీ, నటి పూర్ణ (Poorna) సంప్రదాయ దుస్తుల్లో బాపుబొమ్మలా కనిపిస్తోంది. అందాల విందుతో కుర్రకారును ఆకర్షిస్తోంది. నటిగా వెండితెరపై, జడ్జీగా బుల్లితెరపై స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంటోంది.
వరుస చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న ‘ఢీ’ (Dhee) బ్యూటీకి ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. అటు తనకు వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఇటు బుల్లితెరపైనా టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.
అంతేకాకుండా పూర్ణ తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ టచ్ లో ఉంటోంది. ఈ మేరకు వరుస ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తులు ధరించడంలో పూర్ణకు సరి రారెవ్వరు. ట్రెడిషనల్ గా అందాలను విందు చేయడంలో ఈ బ్యూటీ పంథానే వేరు.
తాజాగా పూర్ణ పంచుకున్న ఫొటోస్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. లెహంగా వోణీలో కేరళ బ్యూటీ అచ్చు తెలుగమ్మాయిలా అందాల ఆరబోతతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. మెరిసిపోయే అందంతో, మత్తెక్కించే ఫోజులతో యువతను చిత్తు చేస్తోందీ బ్యూటీ. నెటిజన్లు కూడా అందాల సుందరికి పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు.
గ్లామర్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ బ్యూటీ వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను కూడగట్టుకుంటోంది. ఆమె అభిమానులు కూడా పూర్ణను సంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువ చూసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ సుందరి అదిరిపోయే దుస్తుల్లో కనువిందు చేస్తోంది.
ఇటీవల నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కాగా తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు రూమర్లు వ్యాప్తి చెందుతుండగా వాటికి చెక్ పెట్టింది. తన హుడ్బీని హగ్ చేసుకున్న పిక్ ను షేర్ చేస్తూ ‘మైన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
కొద్ది రోజుల కింద మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చిన పూర్ణ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతోంది. విదేశాలకు వెళ్లేందుకు వీసాలను అందించే సంస్థని నిర్వహిస్తున్న షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతంది. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగా.. ప్రస్తుతం పెళ్లి కార్యక్రమాలపై బిజీగా ఉన్నారు.
పూర్ణ తెలుగు ఆడియెన్స్ కు ‘అవును’ చిత్రంతో బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో భిన్న పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం తన ఇమేజ్ కు తగిన పాత్రల్లోనే నటిస్తోంది. రీసెంట్ గా ‘అఖండ’తో మంచి సక్సెస్ ను చూసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘దసరా, బ్యాక్ డోర్’, ‘వృత్తం’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.