ఇడ్లీ కొట్టు ఫస్ట్ రివ్యూ , సినిమా ఎలా ఉంది? ధనుష్ డైరెక్షన్ తో మెప్పించాడా ?
ధనుష్ , నిత్య మీనన్ జంటగా నటించిన ఇడ్లీ కొట్టు (ఇడ్లీ కడై) సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దసర సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాా ఎలా ఉంది? ధనుష్ డైరెక్షన్ ఎలా చేశారు? రివ్యూ చూద్దాం.

ధనుష్ దర్శకత్వం లో
సౌత్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ధనుష్. నటనతో పాటు ఈ మధ్య కాలంలో దర్శకత్వం కూడా చేస్తున్నాడు. పా.పాండి, రాయన్ తర్వాత ఇప్పుడు 'ఇడ్లీ కడై' సినిమాకు దర్శకత్వం వహించాడు ధనుష్. ఆయన గత చిత్రం 'రాయన్' 100 కోట్లు వసూలు చేసింది.
ఇడ్లీ కొట్టు సినిమా
ఇడ్లీ కొట్టు (ఇడ్లీ కడై) సినిమాను ఆకాష్ భాస్కరన్ డాన్ పిక్చర్స్, ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తిరు సినిమా తరువాత నిత్యా మీనన్ ధనుష్ తో కలిసి హీరోయిన్‌గా నటించిన సినిమా ఇది. తిరు సినిమాలో ధనుష్, నిత్య మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. దాంతో ఈసినిమాలో కూడా ఈ జంట అదరగొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.
నిజ జీవిత కథ
'ఇడ్లీ కొట్టు సినిమా' సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. తన చిన్ననాటి అనుభవాలతో ఈ సినిమాను తీశానని ధనుష్ చెప్పాడు. ఇది మాదంపట్టి రంగరాజ్ జీవిత కథ అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈసినిమా కథ ఎవరిది అనేది మాత్రం ఇంత వరకూ ఎవరికి తెలియదు. తమిళనాడ మాత్రం మాదంపట్టి రంగరాజ్ కదే అని నమ్మకంగా ఉన్నారు.
ఇడ్లీ కడై సినిమా ఎలా ఉంది?
'ఇడ్లీ కడై' సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని చెప్పారు. సినిమా తాలూకా కథ, ఎమోషనల్ షేడ్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, కుటుంబ సంబంధాల మాధుర్యం — ఇవన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ధనుష్ కథ చెప్పే విధానంలో ఎమోషనల్ డెప్త్ ఉండటం అనేది ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ఇదే అంశం ఈ సినిమాలో కూడా ప్రధాన బలంగా నిలవనుందని
గ్రామీణ నేపథ్యంలో
పూర్తిగా కుటుంబ విలువలతో, గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఇప్పటికే వచ్చిన ప్రీ-రిలీజ్ టాక్ చెబుతోంది. ఎలాంటి అభ్యంతరాల్లేని కుటుంబ సినిమాగా రూపొందిన ‘ఇడ్లీ కొట్టు’, థియేటర్లలో అన్ని వయసుల ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలా ఉంది. మరి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ ను సాధిస్తుందో చూడాలి.