- Home
- Entertainment
- ఎర్రని డ్రెస్‌లో సెగలు రేపేలా `ధమ్కీ` పిల్ల అందాలు.. మేకప్‌లో దరిద్రంగా ఉన్నావంటూ నెటిజన్లు విమర్శలు
ఎర్రని డ్రెస్‌లో సెగలు రేపేలా `ధమ్కీ` పిల్ల అందాలు.. మేకప్‌లో దరిద్రంగా ఉన్నావంటూ నెటిజన్లు విమర్శలు
హాట్ హీరోయిన్ నివేతా పేతురాజ్ సెగలు రేపే అందాలతో అలరిస్తుంది. మరోవైపు నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకట్టుకుంటుంది. అయితే సహజంగానే హాట్‌గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు విమర్శల పాలవుతుంది.

నివేతా పేతురాజ్ తాజాగా రెడ్ డ్రెస్‌లో మెరిసింది. అందాలన్నీ కప్పేస్తూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పటిలాగే తన హాట్ నెస్ ని మాత్రం వదల్లేదు. నిండైన దుస్తులు ధరించినా తన బిగువైన డ్రెస్‌లో పరువాల విందుతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది నివేతా.
స్టయిలీష్ హెయిర్ స్టయిల్, స్లీవ్ లెస్ డ్రెస్‌లో హోయలు పోయింది. మొన్న `ధమ్కీ` ట్రైలర్ ఈవెంట్‌లో నివేతా పేతురాజ్ ఇలా హాట్‌గా, ఘాటుగా కనిపించి ఆడియెన్స్ ని అబ్బురపరిచింది. ఈవెంట్‌లోనే హైలైట్‌గా నిలిచింది. అయితే ఈవెంట్‌లో బాగానే ఉంది. కానీ ఫోటో షూట్లో మాత్రం విమర్శల పాలవుతుంది.
తాజాగా ఈ సెక్సీ భామ తన ఈవెంట్‌కి సంబంధించిన ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె లుక్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. హెయిర్ స్టయిల్ అస్సలు బాలేదని అంటున్నారు. ఇక మేకప్‌ని దారుణంగా తిడుతున్నారు. మామూలుగానే సెక్సీగా ఉంటావు, ఈ దరిద్రం మేకప్ ఎందుకు అంటున్నారు. మేకప్‌తో సహజమైన అందాన్ని చెడగొట్టుకుంటున్నావ్ అని అంటున్నారు.
అర్జెంట్‌గా మేకప్ తీసేయాలని, చూడలేకపోతున్నామని అంటున్నారు. ఇలా చూస్తుంటే నేపాలి ఐటెమ్ గర్ల్ లా ఉన్నావని, డకోటా జాన్సన్, కొరియన్ గర్ల్ ఇలా నానా రకాల పేర్లతో పిలుస్తూ ఆడుకుంటున్నారు. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్‌తో కలిసి `ధమ్కీ` చిత్రంలో నటిస్తుంది. విశ్వక్ సేన్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనకు లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించి ఆకట్టుకుంది నివేతా. అంతేకాదు పాటల్లో మరింత హాట్‌గా కనిపించింది. అందాల విందు చేస్తూ అలరించింది.
అయితే ఈ బ్యూటీ వరుసగా విశ్వక్ సేన్‌తోనే చేస్తుంది. గతంలో `పాగల్` చిత్రంలో నటించింది. ఇప్పుడు `దాస్ కా ధమ్కీ` చేస్తుంది. అయితే ఈ ఇద్దరుప్రేమలో ఉన్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దాని కారణంగానే వరుసగా సినిమాలు చేస్తున్నారని టాలీవుడ్‌లో వినిపించే భోగట్టా. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
`మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఈ సినిమా బాగానే మెప్పించింది. ఆ తర్వాత `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అలా వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్`, `బ్లడీ మేరీ`, `విరాటపర్వం` చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `ధమ్కీ` తప్ప మరేది లేదు. ఇది కూడా ఈ నెల 22న విడుదల కాబోతుంది.
ఈ లెక్కన ప్రేమలో పడి అవకాశాలు పోగొట్టుకుంటుందా అనే టాక్ నడుస్తుంది. విశ్వక్ మాయలో కెరీర్‌ని ఆగం చేసుకుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
కెరీర్ పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది నివేతా పేతురాజ్. ఆమె గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. స్వతహాగానే హాట్‌గా ఉండే నివేతాని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. ఆమె గ్లామర్ ఫోటోలు చూసేందుకు ఎగబడుతుంటారు.