- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషిని రెచ్చగొట్టిన వసు.. జగతి, మహేంద్రకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ ఇగో!
Guppedantha Manasu: రిషిని రెచ్చగొట్టిన వసు.. జగతి, మహేంద్రకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ ఇగో!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ రక్తసంబంధం లో ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. దీంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి (Rishi) వసును వాళ్ళింట్లో డ్రాప్ చేసి వెళుతుండగా మీ మినిస్టర్ గారిని బాగా ప్రభావితం చేసిన ఆ ఇద్దరికీ నా బహుమానం కింద ఈ బుకె ఇవ్వ్వు అని చెబుతాడు. ఇక వసు రిషి సార్ మీకోసం బుకే పంపారు అని మహేంద్ర కు చెబుతుంది. దాంతో మనసులో మహేంద్ర (Mahendra) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు.
దాంతో జగతి (Jagathi) కూడా చాలా ఆనంద పడుతుంది. అదే క్రమంలో జగతి రిషి మనసు ఈ పువ్వు లాంటిది కాస్త ఎండిపోయిన తట్టుకోలేదు అని చెబుతుంది. కాబట్టి రిషి (Rishi) ను చూసుకునే బాధ్యత మనిద్దరిది అని జగతి అంటుంది.
ఆ తర్వాత దేవయాని (Devayani) రిషి వస్తుండగా వల్లమాలిన ఏడుపు ఏడుస్తూ.. జగతి ఇంటికి వెళ్లిన విషయం చెబుతుంది. అక్కడ తనని జగతి నానారకాలుగా అవమానించిందని దేవయాని రిషికి నెగిటివ్ గా చెబుతుంది. దాంతో రిషి జగతి (Jagathi) విషయంలో ఎంతో ఆలోచన వ్యక్తం చేస్తాడు.
ఆ క్రమంలో దేవయాని (Devayani) మీ కన్న తల్లి అని రిషి (Rishi) తో అనగా.. రిషి పెద్దగా విరుచుకుపడి తను నా కన్నతల్లి కాదు అని అంటాడు. నువ్వే నా కన్నతల్లి అని అంటాడు. అంతేకాకుండా పెద్దమ్మ మీరు ఈ విషయం లో బాధపడకండి అని అంటాడు.
ఆ తర్వాత జగతికి (Jagathi) కాలేజ్ స్టాప్ లో ఒక ఆమె ఫోన్ చేసి మిషిన్ ఎడ్యుకేషన్ రిషి (Rishi) సార్ రద్దు చేసిన విషయంలో కాలేజ్ లో కొంతవరకు వ్యతిరేకత ఉందని చెబుతోంది. దాంతో జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఆ తర్వాత రిషి (Rishi) ప్రాజెక్ట్ రద్దు చేసిన విషయం లో నోటీస్ బోర్డ్ లో ఒక వ్యక్తి నోటీసు వేస్తాడు. దాంతో కాలేజీ మొత్తం షాక్ అవుతుంది. ఇక ఈ విషయం గౌతమ్ (Goutham) కు కూడా తెలిసి అక్కడకు పరిగెత్తుతాడు.
ఇక వసు దగ్గరకు ఆ కాలేజీ స్టూడెంట్స్ వచ్చి ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారని విరుచుకు పడతారు. దాంతో వసు అది రిషి (Rishi) సార్ ఇష్టం అని చెప్పగా.. దాంతో ధనుష్ (Dhanush) నువ్వు రిషి సార్ పార్టీ ఏ కదా అని అవమానిస్తాడు. తర్వాత అక్కడికి వచ్చిన రిషి వీళ్లందరిని నువ్వే రెచ్చగొడుతున్నావు అంటూ వసు ను అపార్థం చేసుకుంటాడు.