- Home
- Entertainment
- Devata: జానకమ్మ మాటలకి కుళ్ళిపోయిన మాధవ్.. దేవి నా సొంత మనవరాలు అంటూ షాకిచ్చిన దేవుడమ్మ!
Devata: జానకమ్మ మాటలకి కుళ్ళిపోయిన మాధవ్.. దేవి నా సొంత మనవరాలు అంటూ షాకిచ్చిన దేవుడమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగష్టు 24వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మాధవ్ రుక్మిణి తో ఇక్కడ ఉంటే నేను అందరికీ నువ్వే రుక్మిణి అని చెప్పేస్తాను మర్యాదగా బయటికి రా అని అంటాడు. రుక్మిణి అప్పుడు బయటికి వస్తుంది. ఇంతట్లో మాధవ్ పిల్లలు తీసుకెళ్తూ ఉండగా దేవుడమ్మ వచ్చి పిల్లల్ని ఆడుకొనివ్వండి మీరు వెళ్ళండి వాళ్ళు తర్వాత ఇంటికి వస్తారు అని అంటుంది. అప్పుడు దేవి వాళ్ళు కూడా మేము తర్వాత ఇంటికి వస్తాను నాయనా ముందు మీ మీరు వెళ్ళండి అని అంటాది. ఆ తర్వాత మాధవ్ రుక్మిణి తో ఈరోజు నేను ఏమీ చేయలేదని రేపు అలాగే అవుతది అని అనుకోవద్దు.
రమ్మన్న వెంటనే బయటికి వచ్చి మంచి పని చేసావు లేకపోతే వాళ్లకు చెప్పేద్దాం అనుకున్నాను అని మాధవ్ అనగా నువ్వు ఈరోజు ఏం చేయలేకపోయావు అలాగే రేపు కూడా ఏం చేయలేవు నువ్వు ఏం చేయాలన్నా ముందు మా అందరిని దాటుకొని వెళ్ళాలి. అది నీకు జరగని పని అని అంటుంది.నువ్వు ఈ ఇంటికి వచ్చావని ధైర్యం కూడా వచ్చినట్టు ఉన్నాదే ప్రతిరోజు ఒకలా ఉండదు గుర్తుంచుకో రాధా రేపు మాత్రం కచ్చితంగా ఈ రోజులా ఉండదు అని అంటాడు మాధవ్.
ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ రుక్మిణి ఫోటోని చూసుకుంటూ రుక్మిణి ఎక్కడికి వెళ్లి పోయావు నిజంగా బతికుంటే నా దగ్గరికి రావడానికి నీకు ఏంటి అడ్డు చెప్తుంది. కమలమ్మకి కూతురు పుట్టింది నీ పేరే పెట్టుకున్నాము నువ్వు లేకపోయినా మీ పేరైనా మాకు వినిపిస్తది అని అనగా భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అంటుంది. రుక్మిణి మాట్లాడుతున్నాను అని ఫోటో చూపిస్తుంది దేవుడమ్మ. ఆ తర్వాత కమల కూతుర్ని అందరూ ఎత్తుకొని లాలిస్తూ ఉంటారు.
అప్పుడు మేము ఇంకా బయలుదేరుతాము అని జాతకమ్మ అనగా రాదని నేను ఎప్పటినుంచో చూడాలనుకున్నాను కానీ అది కుదరలేదు కనీసం ఈ కనుక ఇవ్వండి అని దేవుడమ్మ,రాధకి చీర ఇస్తుంది సరే ఎప్పటికైనా రాదని చూపించే బాధ్యత నాది అని జానకమ్మ అని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరని చూసుకుని దేవుడమ్మ వాళ్ళకి మన రాధ అంటే ఎంత గౌరవము ఎంత బాగా చూసుకుంటున్నారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కల్మషం లేని మనుషులు. ఆఫీసర్ కుటుంబం అయినా సరే ఏమాత్రం గర్వం లేదు.
అలాంటి ఇంట్లో కోడలుగా ఉండడం అంటే సరిచేసుకున్న అదృష్టమే అని అంటారు ఈ లోగా మాధవ్ ఈ మాటలన్నీ విని కోపం తో రగిలిపోయాడు. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ, భాషా కమలా దగ్గరికి వెళ్లి ఈ పేరు పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నదా అని అడగగా లేదమ్మా నేను ఇదే పేరు పెట్టాలనుకున్నాను. కాకపోతే రుక్మిణి లేని లోటు గుర్తుచేసినట్టు ఉంటాది అని ఆగిపోయాము అని కమల అంటుంది. అప్పుడు దేవుడమ్మ, రుక్మిణి లేదు కనీసం తన పేరైనా ఇంట్లో అంతా వినబడాలి.
మన చుట్టూ ఆడుకోవాలి ఆ సంబరాలు ఉండాలి అందుకే పేరు పెట్టాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి ఆదిత్య దగ్గరికి వెళ్లి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది పెనిమిటి, కమాలక్క బిడ్డ బారసాలు చూశాను. ఎవరైనా చూస్తారేమో నన్ను అని భయపడ్డాను అని అంటుంది. అప్పుడు ఆదిత్య నేను భయపడ్డాను కానీ అందరూ బారసాల సంబరాలు మునిగిపోయి నిన్ను పట్టించుకోలేదు ఆఖరికి మంచే జరిగింది ఈ రోజు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!