MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సమంత 'ఊ అంటావా' ఐటెం సాంగ్ కి ఎందుకు ఒప్పుకుందో తెలుసా.. కాజల్, పూజా హెగ్డే, తమన్నాపై దేవిశ్రీ కామెంట్స్  

సమంత 'ఊ అంటావా' ఐటెం సాంగ్ కి ఎందుకు ఒప్పుకుందో తెలుసా.. కాజల్, పూజా హెగ్డే, తమన్నాపై దేవిశ్రీ కామెంట్స్  

ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కామన్ అయిపోయాయి. ఐటమ్స్ సాంగ్ వల్లే సినిమాపై బజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఐటెం సాంగ్స్ ప్రభావం చూపుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ ఐటెం సాంగ్స్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది.

tirumala AN | Published : Mar 23 2025, 01:33 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Tmanannaah, Pooja Hegde, Samantha

Tmanannaah, Pooja Hegde, Samantha

ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కామన్ అయిపోయాయి. ఐటమ్స్ సాంగ్ వల్లే సినిమాపై బజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఐటెం సాంగ్స్ ప్రభావం చూపుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ ఐటెం సాంగ్స్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

24
Asianet Image

తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రీలీల, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఐటెం సాంగ్స్ లో నటించారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వీళ్లంతా ఐటెం సాంగ్స్ చేశారు. ఒకరకంగా కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. సాంగ్ కనుక ఫ్లాప్ అయితే వాళ్ళ క్రేజ్ పడిపోయో అవకాశం ఉంది. స్టార్ హీరోయిన్లు మీ ఐటెం సాంగ్స్ చేస్తున్నప్పుడు మీపై ఎలాంటి ఒత్తిడి ఉండేది అని యాంకర్ దేవిశ్రీ ని ప్రశ్నించారు. 

34
Asianet Image

దీనికి దేవిశ్రీ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. సమంత కానీ, తమన్నా కానీ, పూజా హెగ్డే కానీ వీళ్లంతా సాంగ్ విన్న తర్వాతే చేయడానికి అంగీకరించారు. సమంతకి ముందు సాంగ్ వినిపించలేదు. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఉంటుంది అని చెప్పాం. చాలా రోజులు పాటు చేయాలా వద్దా అని తెగ ఆలోచించింది. ఒక్కసారి సాంగ్ విన్న తర్వాత సమంత వెంటనే ఓకె చెప్పింది దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సమంత చేసిన ఊ అంటావా మావ సాంగ్ దేశం మొత్తం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమంతకి ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్. 

44
Pooja Hegde

Pooja Hegde

సమంత మాత్రమే కాదు.. కాజల్ అగర్వాల్, శ్రీలీల, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఐటెం సాంగ్స్ చేశారు. కాజల్ జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ చేశారు. పూజా హెగ్డే రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి సాంగ్ చేసింది. తమన్నా కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జై లవకుశ చిత్రంలో స్వింగ్ జరా సాంగ్ చేసింది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories