Guppedantha manasu: దేవయాని కుట్రకు బలి కానున్న రిషి.. వసుధార ఏం చెయ్యనుంది?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జగతి,మహేంద్రా, గౌతమ్ ముగ్గురు దేవయానిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకేమైనా ప్లాన్ వేశారా? అని జగతి అంటుండగా వసుధార, రిషి ఇద్దరు సరిగ్గా ఉన్నప్పుడు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. మహేంద్ర, అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరు ఫోన్ ఎత్తట్లేదు? అని అనుకుంటారు. తర్వాత సీన్లో రిషి, వసుధార రాత్రిపూట చలిమంట పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు రిషి, వసుధారతో నేను నిన్ను ఒక విషయం అడుగుతాను అని అంటాడు.
ఏంటి అని అనగా, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ని, నా కళ్ళముందే పగిలిపోయిన గిఫ్ట్ ని తిరిగి నాకు ఇవ్వాలని నీకెందుకు అనిపించింది, అయినా అంత జరిగిన తర్వాత కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడగగా ఈ సమయంలో నా మనసులో మాట చెప్తే బాగోదు. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడొద్దు సర్ అని వసుధార అనగా, మరేం మాట్లాడమంటావ్? సాక్షి గురించి మాట్లాడన? అందరూ మారిపోతున్నారు నేను తప్ప అని రిషి బాధపడుతూ ఉండగా కార్ బాగు అయింది అని మెకానిక్ కార్ తాళాలు రిషికి ఇస్తాడు.
అప్పుడు రిషి ఫోన్ చూసుకుంటున్నప్పుడు దేవయాని మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఏమైంది అని తిరిగి చెయ్యగా రిషి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు. అసలు నిన్ను చూస్తాను మళ్ళీ అని అనుకోలేదు. త్వరగా రా నాన్న నిన్ను చివరిసారి చూడకుండానే చనిపోతానేమో అని చెప్పి ఫోన్ కట్ చేసి స్విచాఫ్ చేసేసుకుంటుంది దేవయాని. రిషి కంగారుగా బయలుదేరుతాడు. రిషి కంగారుగా బయలుదేరతాడు. కొంచెం మెల్లిగా డ్రైవ్ చేయండి అని అనగా పెద్దమ్మ ఏడుస్తుంది, ఏమైందో? అని రిషి అంటాడు.
ఏమై ఉంటుంది అని వసుధార జగతికి మెసేజ్ చేస్తుంది. జగతి వాళ్ళిద్దర్నీ త్వరగా రమ్మంటుంది. దేవయాని ఇంట్లో ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. కొన్నిసార్లు ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు రివర్స్ గా మాట్లాడడమే మంచిది. ఈ రకంగా నైనా రిషి సాక్షితో పెళ్లికి ఒప్పుకుంటాడు అని మనసులో అనుకుంటుంది. అప్పుడు జగతి అక్కడికి వచ్చి, మీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి. అంతేగాని రిషి మీద చూపించొద్దు అని చెప్తుంది.
ఓడిపోయావు అని చేతులెత్తేస్తున్నావా? సాక్షితో రిషి పెళ్లి నేను చేస్తాను అని అంటుంది దేవయాని. అయినా రిషి మీద ఎందుకు మీరు కోపం చూపిస్తున్నారు? అని అడగగా, రిషి నా ప్రాపర్టీ, నేను చెప్పినట్టు వినాలి. అలాగే నాకు కాబోయే కోడలు కూడా నేను చెప్పినట్టే వినాలి. సాక్షి నేను చెప్పినట్టే వింటుంది కనుక సాక్షి ఏ నాకు కోడలుగ కావాలి అంటుంది. ఈలోగా జగతి పైకి వచ్చి మహేంద్రని అర్జెంటుగా రిషికి ఫోన్ చేయమని అడుగుతుంది. అదే సమయంలో రిషి ఇంటికి రిషి రావడం చూసి దేవయాని అక్కడి నుంచి గదిలోకి వచ్చి బాధను నటిస్తుంది.
రిషి కంగారుగా లోపలికి వచ్చి దేవయాని దగ్గరికి వెళ్తాడు. దేవయాని పక్కనే విషం బాటిల్ పెట్టుకొని పడుకుంటాది. రిషి వచ్చేసరికి ఏడుస్తూ మళ్లీ నిన్ను చూడను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను అలారం ముద్దుగా పెంచాను కానీ సాక్షి విషయంలో పొరపాటు చేశాను అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!