- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి వసు బాధ్యతలను అప్పగించిన రిషి.. భయంతో వణికిపోతున్న వసు!
Guppedantha Manasu: దేవయానికి వసు బాధ్యతలను అప్పగించిన రిషి.. భయంతో వణికిపోతున్న వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దేవయాని (Devayani) ఎటకారంగా ఈ రాత్రి పూట వీళ్లు కాలేజీ పనుల్లో తిరిగి అలసి పోయి వచ్చారు. వీళ్ళకు మర్యాదలు చేయవా అని ధరణి తో అంటుంది. దాంతో జగతి మాకేం మర్యాదలు అవసరం లేదు ధరణి (Dharani).. అత్తయ్య గారిని బాగా చూసుకో చాలు అని అంటుంది.
ఆ తరువాత దేవయాని (Devayani) రాజీవ్ కు కాల్ చేసి నాకు అవసరం లేనిది నీకు కావాల్సింది ఒకే మనిషి ఆ మనిషి కంటికి కనిపించకూడదు అని అంటుంది. దాంతో
దేవయానితో రాజీవ్ (Rajeev) అకౌంట్ డీటెయిల్స్ పెడతాను అడ్వాన్స్ కొట్టండి పని మొదలు పెడతాను అని అంటాడు.
మరోవైపు రిషి (Rishi) వసును స్పెషల్ ట్యూషన్ కి తీసుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతాడు. ఇక రిషి వసును కార్ లో బయటకు తీసుకుని వెళుతూ ఉండగా రాజీవ్ వాళ్ళిద్దరినీ ఫాలో అవుతాడు. అంతేకాకుండా దేవయాని (Devayani) కి కాల్ చేసి త్వరలోనే పని పూర్తి చేస్తాను అంటాడు.
ఇక రిషి (Rishi) వసును ఇంటికి తీసుకొని వెళ్లి వసుకు ఎలాగైనా స్కాలర్షిప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో ఉండాలని జగతి తో అంటాడు. అంతే కాకుండా వసుకు ఆ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేయమని ధరణి తో చెబుతాను అంటాడు. ఇక వసు (Vasu) ఇంటికి వచ్చిన విషయం తెలిసిన దేవయాని జీర్ణించుకోలేకపోతోంది.
ఇక రిషి దేవయాని (Devayani) దగ్గరికి వచ్చి వసు కొన్ని రోజులు ఇక్కడికి ట్యూషన్ కి వస్తుంది. మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని తల పెద్దమ్మ తో అంటాడు. దాంతో దేవయాని ఈ రిషి ఎం చేస్తున్నాడు. మొదట జగతి (Jagathi) వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చింది అని మనసులో చిరాకు పడుతుంది.
అంతేకాకుండా వీళ్ళ ఆటలను సాగనివ్వకూడదు అని దేవయాని (Devayani) అనుకుంటుంది. తరువాయి భాగంలో కాలేజీలో ఒక స్టూడెంట్ అందర్నీ భయపెట్టే రిషి సార్ వసు ఏం చెప్తే అది వింటాడు. అని తన తోటి స్టూడెంట్ లతో చెబుతాడు. ఇక అక్కడే ఉన్న వసు (Vasu) ఆ విషయాన్ని గమనిస్తోంది.
ఇక ఆ మాటలు గమనించిన వసు (Vasu) వీళ్ళకి ఏమైంది ఇలా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది. రిషి కి ఫోన్ చేసి నేను ఇంటికి వెళుతున్నాను సార్ అని చెబుతుంది. ఈలోపు దార్లో రాజీవ్ (Rajeev) ఎదురైవుతాడు. అతడిని చూసి భయంతో వణికిపోతుంది వసు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.