Guppedantha Manasu: తల్లి కొడుకులలో మొదలైన భయం.. ఆవేశంతో ఫ్రెస్టేట్ అవుతున్న రిషి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. తల్లి ప్రాణాలను తీసిన వాడి ప్రాణాలు తీసేయాలని తపన పడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కార్యక్రమాలన్నీ అయిపోయాయని తొందరపడొద్దు. అప్పుడే రిషి తల్లిని చంపిన వాళ్ళు ఎవరో అని ఎంక్వయిరీ మొదలుపెట్టాడు. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొడుకుతో చెప్తుంది దేవయాని. అవును మమ్మీ బాబాయ్ నా మీద ఉన్న కోపంతో పిన్ని బాడీని కూడా టచ్ చేయనివ్వలేదు. ఇదే ఆవేశంతో బాబాయ్ రిషికి నిజం చెప్పకుండా జాగ్రత్తపడాలి అంటాడు శైలేంద్ర.
మనం చెప్పకపోయినా రిషికి తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వసుధార ఎప్పుడూ రిషి పక్కనే ఉంటూ తోడుగా నీడగా ఉంటుంది. మన జాతకం మొత్తం తనకు తెలుసు అందుకే ముందు మనం తన సంగతి చూడాలి అంటుంది దేవయాని. అవును మమ్మీ మనం తన అడ్డు కూడా తెప్పిస్తే పీడ విరగడ అయిపోతుంది అంటాడు శైలేంద్ర. ఏ అడ్డు తప్పిస్తారు సార్ అంటూ సడన్గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది వసుధార.
కంగారులో ఏమి మాట్లాడలేక పోతారు తల్లి కొడుకులు. మీరు ఏమి మాట్లాడకపోయినా నీ బుద్ధి, మీ ప్లాన్స్ నాకు తెలుసు అంటుంది వసుధార. తెలిస్తే ఏం చేస్తావ్ అంటాడు శైలేంద్ర. ఇకనుంచి మీ మీద నిఘా పెడతాను, జగతి మేడం చేసిన ప్రాణ త్యాగాన్ని వృధా పోనివ్వను అంటుంది వసుధార.నువ్వు చేసిన చాలెంజ్ కి భయపడి పోవాలా అని నవ్వుతాడు శైలేంద్ర.
అది చూద్దాం రిషి సార్, అప్పుడే తన తల్లిని చంపిన వాళ్ళను గురించి ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేశారు. హాస్పిటల్ నుంచి వచ్చిన జగతి మేడం కచ్చితంగా బ్రతుకుతారని అనుకున్నాం కానీ సడన్గా ఇలా జరిగింది అంటే కచ్చితంగా ఏదో జరిగింది. దీని వెనక మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం మీ పరిస్థితి ఏంటా అని భయంగా ఉంది అంటుంది. దేని గురించి భయపడుతున్నావు అంటూ సడన్గా అక్కడికి వచ్చిన రిషి అడుగుతాడు.
కంగారు పడిపోతారు దేవయాని శైలేంద్ర. పిన్ని గురించి పాపం తనకి ఇలా అయినందుకు మాకు చాలా బాధగా ఉంది. తను ఇంట్లో లేకపోవడం వల్ల ఇటు ఇంట్లోని, అటు కాలేజీలోని పరిస్థితి ఏంటో అనే భయంగా ఉంది అని మాట మార్చేస్తాడు శైలేంద్ర. వీళ్లలో భయం మొదలైంది. ఈ భయం ఇలాగే కంటిన్యూ అవ్వాలి అనుకుంటుంది వసుధార. దేవయాని వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ మా అమ్మ ఆకాశంలో చుక్క అయిపోయింది.
ఆకాశ దీపాలు వెలిగించి కోరుకుంటే వస్తుందంటావా, నాకు మా అమ్మ కావాలి అంటాడు రిషి. ఆకాశ దీపాలు వెలిగిస్తే మన ఆశలు తీరుతాయి కానీ పోయిన వాళ్ళు రారు సార్ అంటుంది వసుధార. తరువాత సీన్లో అందరూ హాల్లో కూర్చుంటారు. మహేంద్రని కూడా తీసుకురమ్మని ధరణికి చెప్తాడు ఫణీంద్ర. వద్దు పెదనాన్న నాన్నని అక్కడే ఉండనివ్వండి. అమ్మ పోయినందుకు నాకే ఇంత బాధగా ఉంది ఇక డాడీ పరిస్థితి ఏంటి అంటాడు రిషి.
నాకే ఎందుకిలా జరుగుతుంది పెద్దమ్మ, చిన్నప్పుడు అంతా అమ్మ ప్రేమకి దూరమయ్యాను. దగ్గరికి వస్తే నా మనసులో బాధ అంతా వెళ్లగక్కాలి అనుకున్నాను. కానీ నా మనసుకి అయినా గాయం నా చేత ఆ పని చేయనివ్వలేదు. నేను మా అమ్మకి చాలా ద్రోహం చేశాను. నాలాంటి కొడుకు ఉండకూడదు అంటాడు రిషి. అలా అనొద్దు అంటాడు ఫణింద్ర. నిజం పెదనాన్న కన్నతల్లిని మేడం అనే పిలిచిన కొడుకుని ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే అంటూ బాధపడతాడు.
ఆ తర్వాత కోపంతో ఊగిపోతూ మా అమ్మని నా నుంచి దూరం చేసిన వాడు ఎవడైనా వాడిని పట్టుకుని తీరుతాను. మా అమ్మ కనిపిస్తే ఈ చేత్తో అన్నం తినిపించి నా ఆశలన్నీ తీర్చుకోవాలి అనుకున్నాను. అలాంటిది ఈ చేత్తోనే నా తల్లికి తలకొరివి పెట్టేలా చేశాడు. అలాంటి వాడిని ఎట్టి పరిస్థితులలోని వదిలేది లేదు, దొరికితే కచ్చితంగా చంపేస్తాను అంటాడు. ఆవేశ పడొద్దు రిషి అంటాడు ఫణీంద్ర. ఆవేశం కాదు పెద్ద నాన్న బాధ.
నన్ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది. నా ప్రాణానికి నా అమ్మ ప్రాణాలు అడ్డవేసింది. అలాంటి వాడిని చంపాలనుకోవడం తప్పా పెద్దమ్మ అంటూ దేవయానిని అడుగుతాడు రిషి. తల్లి కొడుకులిద్దరూ కంగారు పడిపోతారు. రిషి తల్లి ఫోటో దగ్గరికి వెళ్లి నీకు మాట ఇస్తున్నానమ్మ నిన్ను చంపిన వాడిని నీ దగ్గరికి పంపిస్తాను అంటాడు.
మళ్లీ వద్దు నువ్వు మంచి దానివి నువ్వు స్వర్గంలో ఉంటావు, వాడు పాపం చేశాడు వాడిని నరకానికి పంపిస్తాను అప్పటివరకు నా కంటి మీద కునుకు ఉండదు అంటూ బాగా ఫ్రెష్టేట్ అయిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.