- Home
- Entertainment
- వారం రోజుల్లో పెళ్లి చేసేసేలా ఉన్నారు... స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఎంత కష్టం వచ్చిపడింది!
వారం రోజుల్లో పెళ్లి చేసేసేలా ఉన్నారు... స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఎంత కష్టం వచ్చిపడింది!
జాన్వీ కపూర్ తన పెళ్లి వార్తలపై స్పందించారు. వారం రోజుల్లో పెళ్లి చేసేలా ఉన్నారని ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

Janhvi Kapoor
జాన్వీ కపూర్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
దేవర విడుదల కాకుండానే మరో స్టార్ హీరో పక్కన ఛాన్స్ పట్టేసింది జాన్వీ కపూర్. రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవల పూజా కార్యకమాలతో ఆర్సీ 16 ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
కాగా జాన్వీ నటించిన హిందీ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి విడుదలకు సిద్ధమైంది. మే 31న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్ తరచుగా వస్తున్న పెళ్లి వార్తల మీద స్పందించారు. ఈ పుకార్లను ఆమె కొట్టి పారేశారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు త్వరలో వివాహం అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు మూడు కథనాలు నా దృష్టికి వచ్చాయి.
వారం రోజుల్లో నాకు తెలియకుండానే పెళ్లి చేసేసేలా ఉన్నారు. నా దృష్టి ప్రస్తుతం కేవలం కెరీర్ మీదే. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. అని అన్నారు. కాగా జాన్వీ కపూర్ తరచుగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటుంది. ధడక్ హీరో ఇషాన్ కట్టర్, అక్షత్ రంజన్, ఓరి అవత్రమని, శిఖర్ పహారియా జాన్వీ కపూర్ లవర్స్ అంటూ ప్రచారం పొందారు. జాన్వీ కపూర్ వీరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
అయితే ఎవరితో తన రిలేషన్ ని జాన్వీ కపూర్ అధికారికంగా ప్రకటించలేదు. శ్రీదేవి నటవారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఈ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. స్టార్డం తెచ్చే హిట్ అయితే ఆమెకు ఇంకా పడలేదు.