MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Updates: దుమ్మురేపుతున్న దేవగుడి, నెట్‌ ఫ్లిక్స్ చేతికి హైకూ.. హ్రీం, అమరావతికి ఆహ్వానం అప్‌ డేట్స్

Tollywood Updates: దుమ్మురేపుతున్న దేవగుడి, నెట్‌ ఫ్లిక్స్ చేతికి హైకూ.. హ్రీం, అమరావతికి ఆహ్వానం అప్‌ డేట్స్

Tollywood Updates: `దేవగుడి` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. `హైకూ` మూవీ డిజిటల్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. `అమరావతికి ఆహ్వానం` నుంచి టీజర్ వచ్చింది. మల్టీ టాలెంటెడ్‌గా `హ్రీం` హీరో.. ఇలాంటి టాలీవుడ్‌ అప్‌ డేట్లు చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 02 2026, 11:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేటి టాలీవుడ్‌ అప్‌ డేట్స్
Image Credit : Asianet News

నేటి టాలీవుడ్‌ అప్‌ డేట్స్

టాలీవుడ్‌లో రోజూ అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయి. అందులో భాగంగానే కొన్ని సినిమాల అప్‌ డేట్లు వచ్చాయి. అవేంటో చూస్తే, `దేవగుడి` మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే `కోర్ట్` ఫేమ్‌ శ్రీదేవి నటిస్తున్న `హైకు` మూవీ డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. `హ్రీం` మూవీ హీరో పుట్టిన రోజు జరిగింది. వీరితోపాటు శివ కంఠమనేని, సుప్రిత, ధన్యబాలకృష్ణ, ఎస్తేర్‌ నటిస్తున్న `అమరావతికి ఆహ్వానం` మూవీ టీజర్‌ విడుదలయ్యింది. మురళీ మోహన్‌ రిలీజ్‌ చేశారు.

25
దేవగుడి సక్సెస్‌పై దర్శక, నిర్మాత కామెంట్‌
Image Credit : Asianet News

దేవగుడి సక్సెస్‌పై దర్శక, నిర్మాత కామెంట్‌

బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం `దేవగుడి`. ఇందులో  అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తోన్న సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా `దేవగుడి` మూవీకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందనే ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణ బాగుందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి.  రఘు కుంచె  చేసిన వీరారెడ్డి పాత్ర హైలైట్ అయ్యింది.  కొందరు  సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.  చాలా హ్యాపీగా ఉంది` అని తెలిపారు. 

Related Articles

Related image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Related image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
35
మురళీ మోహన్‌ ఆవిష్కరించిన `అమరావతికి ఆహ్వానం` టీజర్‌
Image Credit : Asianet News

మురళీ మోహన్‌ ఆవిష్కరించిన `అమరావతికి ఆహ్వానం` టీజర్‌

శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా `అమరావతికి ఆహ్వానం`.   డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత , నటులు మురళీ మోహన్  రిలీజ్ చేశారు.  

ఈ సంద‌ర్భంగా  మురళీ మోహన్ మాట్లాడుతూ, `అమరావతికి ఆహ్వానం` సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది.  మా గురువు  దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. `అమరావతికి ఆహ్వానం` సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను` అని అన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

45
హ్రీం మూవీ హీరోపై నందు కామెంట్‌
Image Credit : Asianet News

హ్రీం మూవీ హీరోపై నందు కామెంట్‌

 పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్‌ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు. రాజేష్‌ రావూరి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం చిత్ర హీరో పవన్‌ తాతా జన్మదినం సందర్బంగా చిత్ర కార్యాలయంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు హీరో శ్రీనందు.  ఆయన మాట్లాడుతూ, ఇప్పుడే ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‌ చూశాను.  ఎంతో ఎక్సైట్ చేసిన కంటెంట్‌ ఇది అనిపించింది.  ఈ సినిమాతో తమ కెరీర్‌ గొప్పగా ప్లాన్‌ చేసుకుంటున్న హీరో పవన్‌ తాతాకు, హీరోయిన్‌ డాక్టర్‌ చమిందా వర్మలకు నా అభినందనలు. మాటీవిలో పనిచేసి దర్శకునిగా మారబోతున్న రాజేష్‌కు ఇది చక్కని అవకాశం. అందరికి ఆల్‌ ది బెస్ట్‌ ’’అన్నారు. హీరో పవన్‌ మాట్లాడుతూ, ఈ బర్త్‌డే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం లభించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. ఈ వేడుకలో నా కుటుంబ సభ్యులు మా మేనత్త రేణుకమ్మ, గోపి, రేఖ అందరూ పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్‌ చూసిన తర్వాత మీ అందరూ కూడా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.

55
కోర్ట్ ఫేమ్‌ శ్రీదేవి మూవీకి నెట్‌ ఫ్లిక్స్ ఆఫర్‌
Image Credit : Asianet News

కోర్ట్ ఫేమ్‌ శ్రీదేవి మూవీకి నెట్‌ ఫ్లిక్స్ ఆఫర్‌

`కోర్ట్` సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన శ్రీదేవి ఇప్పుడు `హైకూ` చిత్రంలో నటిస్తుంది.   ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈ సినిమా ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.

త‌మిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్త‌పు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related Stories
Recommended image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Recommended image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved