- Home
- Entertainment
- దొబ్బెయ్.. రీతూ చౌదరీకి ఝలక్ ఇచ్చిన పవన్.. తనూజ, సంజనాల పరువు తీసిన ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి
దొబ్బెయ్.. రీతూ చౌదరీకి ఝలక్ ఇచ్చిన పవన్.. తనూజ, సంజనాల పరువు తీసిన ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి
రీతూ చౌదరీకి పెద్ద షాక్ ఇచ్చాడు డీమాన్ పవన్. దొబ్బెయ్ అంటూ కామెంట్ చేశాడు. మరోవైపు ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి కలిసి సంజనా, తనూజ, గౌరవ్ లను ఆడుకున్నారు.

బుధవారం ఎపిసోడ్‌లో హైలైట్స్ ఇవే
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 52వ(బుధవారం) ఎపిసోడ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఓ వైపు భరణి, శ్రీజ హౌజ్‌లోకి రావడం కోసం టాస్క్ ల్లో పోరాటం చేయడం, మరోవైపు రీతూ, పవన్ ల మధ్య గొడవ, ఇంకోవైపు కిచెన్ వద్ద తనూజ, సంజనాల మధ్య వాగ్వాదం, ఇవన్నింటిని మర్చిపోయేలా సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్ చేసిన కామెడీ హైలైట్‌గా నిలిచింది. బుధవారం ఎపిసోడ్‌లో ఇవి హైలైట్‌గా నిలిచాయి. ప్రారంభంలో బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజలలో ఒకరు హౌజ్‌లో ఉండిపోయే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అందుకోసం టాస్క్ లు ఇచ్చారు. అందులో భాగంగా ఒక టవర్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో భరణి, శ్రీజ తమకు సపోర్ట్ కోసం ఇతర కంటెస్టెంట్లని తీసుకునే అవకాశం కల్పించారు.
శ్రీజ, భరణిల కోసం కళ్యాణ్, సుమన్ శెట్టి గొడవ
ఇందులో ఇమ్మాన్యుయెల్, రాము, నిఖిల్ భరణి కోసం పోరాడారు. అలాగే పవన్, గౌరవ్ శ్రీజ కోసం నిలబడ్డారు. ఈ టాస్క్ లో ఎవరూ సరిగా పెట్టలేదు. కాకపోతే బాక్స్ బయట ఎక్కువ బ్రిక్స్ తో శ్రీజది ఉంది. బాక్స్ లో ఒకటే బ్రిక్‌తో భరణిది ఉంది. ఈ విషయంలో సంచాలకులు కళ్యాణ్, సుమన్ శెట్టి మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణ్ శ్రీజకి, సుమన్ భరణికి సపోర్ట్ గా తీర్పు ఇచ్చారు. ఇది చెల్లకపోవడంతో మరొకరిని సంచాలకులుగా తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో భరణి, శ్రీజ కలిసి దివ్వెల మాధురిని ఎంపిక చేసుకోగా, ఆమె శ్రీజ విన్నర్‌గా ప్రకటించింది. ఇదే గేమ్ మరోసారి ఆడారు. అప్పుడు ఎవరూ విన్ కాలేదు. ఇందులో అటు భరణి, ఇటు ఇమ్మాన్యుయెల్ గాయాలపాలయ్యారు.
దొబ్బెయ్.. రీతూకి పవన్ షాక్
మరోవైపు హౌజ్‌లో గొడవలు ఒక రేంజ్‌లో జరిగాయి. కిచెన్ వద్ద పప్పు విషయంలో సంజనాని నిలదీసింది తనూజ. దీంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. తినే విషయంలో గొడవలు చేస్తారా అంటూ ఆమె భోజనం మధ్యలోనే మానేసి వెళ్లిపోయింది సంజనా. ఇంకోవైపు టీ విషయంలో దివ్యకి, గౌరవ్ కి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. గౌరవ్ ఇచ్చిన మూమెంట్కి దివ్య ఫైర్ అయ్యింది. మరోవైపు రీతూ చౌదరీ, పవన్‌ల మధ్య గొడవ జరిగింది. పవన్ తనకు సపోర్ట్ చేయడం లేదంటూ రీతూ ఆరోపిస్తుంది. నువ్వే సపోర్ట్ చేయకపోతే, నావైపు మాట్లాడకపోతే ఎందుకు అంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్. కానీ రీతూ వినలేదు. దీంతో దొబ్బెయ్ అంటూ కామెంట్ చేశాడు పవన్. ఇది ఇద్దరి రిలేషన్ బ్రేకప్‌కి కారణమైంది. రీతూ ఫీల్ అయ్యింది. పవన్‌తో మాట్లాడనని చెప్పింది. కాసేపు ఇద్దరి మధ్య డ్రామా ఆసక్తిని రేకెత్తించింది. అయితే చివరికి కిచెన్ వద్ద మళ్లీ రీతూనే వచ్చి పవన్‌కి భోజనం తినిపించడం విశేషం.
నవ్వులు పూయించిన సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్
ఇలా హౌజ్ మేట్స్ మధ్య వాడివేడిగా గొడవలు జరిగాయి. ఎవరికి వాళ్లు రెచ్చిపోతున్నారు. గొడవలు పడుతున్నారు. అయితే అందులో రియాలిటీ మిస్ అయ్యింది. కావాలనే గొడవ పడుతున్నారనేది అర్థమవుతుంది. లాజిక్ లేకుండా అరవడం చిరాకు పుట్టిస్తోంది. అయితే ఇంతటి హాట్ హాట్‌గా, వేడి వేడిగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి చేసిన కామెడీ హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరు సంజనా, తనూజ, గౌరవ్‌లను ఇమిటేట్ చేశారు. ఇందులో సుమన్ శెట్టి వాళ్ల గురించి బయటకు ఒక అభిప్రాయం చెబుతాడు. తన మనసులో ఇన్నర్ ఫీలింగ్ ని ఇమ్మాన్యుయెల్ వ్యక్తం చేస్తుంటాడు. అందులో భాగంగా గౌరవ్ గురించి గొప్పగా చెప్పాడు సుమన్ శెట్టి.. చాలా తెలివైన వాడు అంటూ వెల్లడించారు. వీడు తెలివైన వాడేంటి, వాకీటాకీకి, ఫోన్‌కి తేడా తెలియదంటూ కామెంట్ చేయడం నవ్వులు పూయించింది.
సంజనా, తనూజల పరువు తీసిన సుమన్, ఇమ్మూ
మరోవైపు సంజనా గురించి సుమన్ శెట్టి చెబుతూ, సంజనా చాలా కూల్ గా ఉంటుంది. ఎవరితోనూ గొడవపడదు, గొడవల్లోకి వెళ్లదు, పెద్దగా మాట్లాడదు అంటే, ఇమ్మాన్యుయెల్ ఆమె కూల్ ఏంట్రా, ఎప్పుడూ గొడవలు, నోరేసుకుని మీద పడుతుంది, ఎక్కడ గొడవ అవుతుందా అని వెయిట్ చేస్తుంది, అందులో తాను హైలైట్ కావాలని చూస్తుందని ఇమ్మూ చెప్పడం నవ్వులు పూయించింది. అనంతరం తనూజ గురించి సుమన్ శెట్టి చెబుతూ, ఆమె మంచి రేషన్ మేనేజర్, ఎప్పుడూ ఏడవదు, స్ట్రాంగ్‌గా ఉంటుంది, ఎప్పుడూ గళగళ మాట్లాడుతుందని చెప్పగా, ఇమ్మూ కింద పడిదొర్లి సెటైరికల్‌గా నవ్వడం హైలైట్‌గా నిలిచింది. హౌజ్‌లో ఈ ఎపిసోడ్ నవ్వులు పూయించింది. అలాగే హౌజ్‌లో దొంగలు పడ్డారు, బోర్డ్ తెప్పించమని ఇమ్మూ చెప్పడం కూడా కామెడీని పంచింది.