దీప్తి సునైనాకి కారు యాక్సిడెంట్ ?.. అసలేం జరిగింది, క్లారిటీ ఇదిగో
సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.
సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. అయితే తాజాగా దీప్తి సునైనా గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
దీప్తి సునైనా యాక్సిడెంట్ కి గురైందని వదంతులు వ్యాపించాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. దీనితో దీప్తి సునైనాకి ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుండటంతో స్వయంగా దీప్తి సునైనా స్పందించింది. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని తాను క్షేమంగా ఉన్నానంటూ దీప్తి సునైనా పేర్కొంది. గతంలో తాను చేసిన అలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం లో అలాంటి దృశ్యాలు ఉన్నాయి.
కొందరు వాటిని వైరల్ చేస్తూ నాకు ప్రమాదం జరిగింది అని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అని పేర్కొంది. ఇలాంటి దారుణమైన అసత్యాలు ప్రచారం చేసి అందరిని ఆందోళనకి గురిచేయొద్దు అంటూ దీప్తి సునైనా స్పందించింది. దీప్తి సునైనా క్లారిటీ ఇవ్వడంతో అవన్నీ పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది.
షణ్ముఖ్ తో కొంత కాలం ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరి బ్రేకప్ కి కారణం సిరి హన్మంత్ అంటూ రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సిరి హనుమంత్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.