- Home
- Entertainment
- వైట్ బెలూన్ గౌన్ లో కట్టిపడేస్తున్న దీపికా పదుకొణె.. ఓర చూపుతో మతి చెడగొడుతున్న ప్రభాస్ హీరోయిన్!
వైట్ బెలూన్ గౌన్ లో కట్టిపడేస్తున్న దీపికా పదుకొణె.. ఓర చూపుతో మతి చెడగొడుతున్న ప్రభాస్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. పలు ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇండియన్ టాప్ యాక్ట్రెస్ లో ఒకరిగానూ.. బిజీయేస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ అందనంత స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే.
ఇక త్వరలో డైరెక్ట్ గా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతోంది దీపికా పదుకొణె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ గా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
అటు హిందీలోనూ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది దీపికా.. మరోవైపు స్పెషల్ ఈవెంట్లకు, అవార్డు ఫంక్షన్లకూ హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. ‘ఎల్లే’(Elle) ఫ్యాషన్ అవార్డు ఈవెంట్ కు హాజరైంది. ఈ సందర్భంగా వైట్ గౌన్ లో మెరిసింది. అందరి చూపు తనవైపే పడేలా చేసింది.
ఫ్యాషన్ డిజైనింగ్ లో తనదైన మార్క్ చూపించిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కనువిందు చేస్తోంది. తాజాగా వైట్ బెలూన్ గౌన్ లో ఆకట్టుకుంది. మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓరచూపుతో యువతను చిత్తు చేసి నెట్టింట సందడిగా మారింది.
సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీపికా పదుకొణె.. ఇలా నిత్యం నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. 70 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగిన దీపికా.. ఎప్పుడూ క్రేజీ అప్డేట్స్ అందిస్తూ మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
కేరీర్ విషయానికొస్తే.. దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగైదు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘జవాన్’లో నటిస్తోంది. అలాగే హృతిక్ రోషన్ సరసన ‘ఫైటర్’లోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్ ను లీడ్ చేస్తోంది.