MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రభాస్ కల్కి 2 నుంచి దీపికా పదుకొణె అవుట్.. అసలు కారణం ఇదేనా?

ప్రభాస్ కల్కి 2 నుంచి దీపికా పదుకొణె అవుట్.. అసలు కారణం ఇదేనా?

Kalki 2- Deepika Padukone: ప్రభాస్ - నాగ్ ఆశ్విన్ కాంబో మూవీ "కల్కి పార్ట్ 2" నుంచి షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించబోవడం లేదని వైజయంతీ మూవీస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది. 

3 Min read
Author : Rajesh K
Published : Sep 18 2025, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కల్కి 2 నుంచి బిగ్ అప్డేట్
Image Credit : instagram

కల్కి 2 నుంచి బిగ్ అప్డేట్

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2898 AD’ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కింది. విజువల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి, ఇండియన్ సినిమాకి కొత్త గౌరవాన్ని మరింత పెంచింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన “కల్కి 2898 AD” కి సీక్వెల్‌గా కల్కి 2 రాబోతోంది. ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో పోషించారు. అయితే తాజా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటీ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దీపికా పదుకొణె నటన అద్బుతం
Image Credit : instagram

దీపికా పదుకొణె నటన అద్బుతం

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది కల్కి 2898 AD. ఇండియన్ సినిమాకి కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీపిక తన ప్రత్యేక నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్ర బృందానికి సహకరించి నటించడం విశేషంగా నిలిచింది. సినిమాలో ఆమె పోషించిన "సుమతి" పాత్ర కథలో ప్రధానంగా నిలిచి, సీక్వెల్‌లో మరింత ప్రాధాన్యత వహిస్తుందని అభిమానులు ఊహించారు.

35
మూవీ మేకర్స్ షాకింగ్ స్టేట్ మెంట్
Image Credit : instagram

మూవీ మేకర్స్ షాకింగ్ స్టేట్ మెంట్

ఎన్నో అంచనాలతో తెరకెక్కబోతున్న కల్కి 2 లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కల్కి పార్ట్ 2" లో దీపికా పదుకొణె నటించబోవడం లేదని చిత్రం యూనిట్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు వైజయంతీ మూవీస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది. అందులో ‘కల్కి 2లో నటి దీపికా పదుకొణె భాగం కాబోవడం లేదు. అనేక చర్చలు, పరిశీలనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో ఆమె మాతో కలిసి దీర్ఘకాలం ప్రయాణం చేసినప్పటికీ, పార్ట్ 2 లో అలా సాధ్యపడలేదు. కల్కి లాంటి ప్రాజెక్ట్‌కి సంపూర్ణ నిబద్ధత అవసరం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు.

45
దీపికా పదుకొణె వైదొలగిన అసలు కారణం ఇదేనా?
Image Credit : instagram

దీపికా పదుకొణె వైదొలగిన అసలు కారణం ఇదేనా?

వైజయంతీ మూవీస్ ట్విట్ వెనుక అసలు కారణం స్పష్టమైందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె రోజుకు 8 గంటలకంటే ఎక్కువ పని చేయనని ఒక కొత్త షరతు పెట్టుకున్నారట. అయితే, ‘కల్కి’ లాంటి భారీ స్థాయి ప్రాజెక్ట్‌లో ఇలాంటి కండీషన్లు అనుకూలించవని అప్పట్లోనే టాక్ వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు "పూర్తి నిబద్ధత అవసరం" అని ప్రకటించడం ఆ వార్తలకు బలం చేకూర్చినట్లే కనిపిస్తోంది. అలాగే.. ఇటీవల తల్లి అయిన దీపికా, తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు నెలల తరబడి కంటిన్యూగా షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. కానీ కుటుంబ బాధ్యతలు, బిడ్డతో గడిపే సమయం కారణంగా దీపికా పూర్తిస్థాయి అంకితభావాన్ని చూపలేకపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎటువంటి విభేదాల వల్ల కాదని, కేవలం పని శైలి, కట్టుబాట్ల సమస్య వల్లనే ఇలా జరిగిందని అర్థమవుతోంది.

This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. 

After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. 

And a film like…

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025

55
కల్కి 2 పై భారీ అంచనాలు
Image Credit : instagram

కల్కి 2 పై భారీ అంచనాలు

2024లో విడుదలైన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ప్రభాస్ ‘భైరవ’గా, దీపికా పదుకొణె ‘సుమతి’గా, అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా, కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భవిష్యత్తు ప్రపంచాన్ని ప్రతిబింబించే కథ, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్ నిర్మాణం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే రెండో భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. దీపికా సీక్వెల్‌ నుంచి తప్పుకోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ ఎవరనేది సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ విషయంపై మూవీ మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Related Stories
Recommended image1
ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. సందీప్ వంగా స్పిరిట్ ప్లాన్ రివీల్..
Recommended image2
Kalki 2: నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved