10 వేల కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక హీరోయిన్..ఇండియన్ బాక్సాఫీస్ కి ఆమె క్వీన్
బాలీవుడ్‌లో ఖాన్లను దాటి, అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక నటి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా వెనకబడ్డారు. బాక్స్ ఆఫీస్ క్వీన్ ఎవరో చూద్దాం.
సినిమా విజయాన్ని బాక్స్ ఆఫీస్ వసూళ్లతోనే కొలుస్తారు. షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ల వసూళ్లు ఎక్కువే కానీ, ఈ నటి ముందు వాళ్ళు కూడా దిగదుడుపే.
ఖాన్లు 7000 కోట్లకు పైగా వసూలు చేసినా, 10,000 కోట్ల మార్కును దాటిన ఈ నటిని మాత్రం అందుకోలేకపోయారు. బాలీవుడ్ లో ఖాన్ హీరోల సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి.
బాక్స్ ఆఫీస్ క్వీన్ దీపికా పదుకొణే. గత దశాబ్దంలో అత్యంత విజయవంతమైన, అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఎదిగారు.
18 ఏళ్ల కెరీర్‌లో దీపికా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 10,200 కోట్లు వసూలు చేశాయి. ఇందులో భారతీయ సినిమాల నుండి 8000 కోట్లు, హాలీవుడ్ సినిమా XXX నుండి 2200 కోట్లు ఉన్నాయి.
దీపికా అనేక హిట్ సినిమాల్లో నటించారు. 'పద్మావత్' వంటి సినిమాలతో సొంతంగా కూడా హిట్ ఇచ్చారు.దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
రెండేళ్ల క్రితం వరకు దీపికా అత్యధిక పారితోషికం తీసుకునే నటి కాదు. 2023, 2024లలో కొన్ని మెగా సినిమాలతో అగ్రస్థానానికి చేరుకున్నారు.
గత రెండేళ్లలో 'పఠాన్', 'జవాన్', 'కల్కి' వంటి 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాల్లో నటించారు. 'ఫైటర్', 'సింగం' కూడా 300 కోట్లకు పైగా వసూలు చేశాయి.
దీపికా, ప్రియాంకా చోప్రా (6000 కోట్లు), కత్రినా కైఫ్ (5500 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు సాధించారు.తక్కువ సమయంలో దీపికా బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.
షారుఖ్ ఖాన్ (9000 కోట్లు), అక్షయ్ కుమార్ (8300 కోట్లు), సల్మాన్ ఖాన్ (7500 కోట్లు), అమీర్ ఖాన్ (7200 కోట్లు) సాధించి దీపికా కంటే వెనకబడ్డారు.
దీపికా ప్రస్తుతం 'కల్కి 2', 'బ్రహ్మాస్త్ర 2' సినిమాల్లో నటిస్తున్నారు. ఇవి వందల కోట్లు వసూలు చేసే సామర్థ్యం ఉన్న సినిమాలు.