- Home
- Entertainment
- ఆస్కార్ వేదికపై బ్యూటీ క్వీన్ మ్యాజిక్.. దీపికా సొగసుపై సమంత కూడా అలా కామెంట్ చేసిందంటే..
ఆస్కార్ వేదికపై బ్యూటీ క్వీన్ మ్యాజిక్.. దీపికా సొగసుపై సమంత కూడా అలా కామెంట్ చేసిందంటే..
ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. బ్లాక్ డ్రెస్ లో దీపికా పదుకొనె మెరుపులు మెరిపిస్తూ వేదికపైకి వచ్చింది.

ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. బ్లాక్ డ్రెస్ లో దీపికా పదుకొనె మెరుపులు మెరిపిస్తూ వేదికపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి దీపికా పదుకొనె ఆస్కార్స్ కి హాజరైన వారందరికీ బ్రీఫ్ గా వివరించింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఇద్దరు భారతీయ యోధుల స్నేహం నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. నాటు నాటు సాంగ్ గురించి మీకు ఇంకా తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి అంటూ దీపికా పదుకొనె అందంగా తన మాటలతో సైతం అలరించింది.
దీపికా పదుకొనె ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి చెబుతుంటే ఆడిటోరియం మొత్తం కేరింతలు, చప్పట్లు వినిపించాయి. ఇండియా తరఫున ఈ బ్యూటీ క్వీన్ కి అకాడమీ అవార్డ్స్ లో హోస్ట్ గా అవకాశం దక్కింది. ఇది నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. తన గ్లామర్, హావ భావాలు, చిరునవ్వుతో దీపికా అక్కడున్న వారందరిని మెస్మరైజ్ చేసింది.
ఓపెన్ షోల్డర్స్ తో, క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ దీపికా పదుకొనె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓపెన్ షోల్డర్ బ్లాక్ లాంగ్ గౌన్ లో దీపికా శృంగార దేవతలా వెలిగిపోయింది. ఈ ఫోటోలని దీపికా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి.
అలియా భట్, సమంత లాంటి క్రేజీ స్టార్స్ సైతం దీపికా ఆస్కార్ లుక్ పై స్పదించారు. దీపికా తన అందంతో అంతర్జాతీయ వేదికలపై దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది అని అలియా ప్రశంసించింది.
ఇక సమంత దీపికా పదుకొనె పిక్ పై స్పందిస్తూ.. డెడ్ అంటూ హార్ట్ ఎమోజిలు పెట్టింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్లు కూడా దీపికా అందానికి మైమరచిపోతున్నారంటే ఇక కుర్రాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.



