MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • దీపికా పదుకొనె కే హైయిస్ట్ రెమ్యనరేషన్, మిగతా హీరోయిన్లకి ఎంతిస్తున్నారో తెలుసా ?

దీపికా పదుకొనె కే హైయిస్ట్ రెమ్యనరేషన్, మిగతా హీరోయిన్లకి ఎంతిస్తున్నారో తెలుసా ?

దీపికా పదుకోని బాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్. త్వరలో తల్లి కాబోతున్న ఆమె రీసెంట్ గా ప్రభాస్ కల్కిలో కనిపించింది. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 24 2024, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Deepika Padukone

Deepika Padukone

హీరో మన వాడైనా హీరోయిన్ మాత్రం నార్త్ ఇండియాకు చెందినదై ఉండాలి. అది మన తెలుగు సినిమా అవలంభిస్తున్న రూల్. అక్కడ యావరేజ్ అనిపించుకున్నవాళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్లు కూడా తెలుగులో హీరోయిన్స్ వెలిగారు.వెలుగుతున్నారు. మధ్య మధ్యంలో రష్మిక,  సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవి, త్రిష, నయనతార వంటి సౌత్ ఇండియన్స్ కనపడుతున్నా...బాలీవుడ్ హీరోయిన్స్ దే హవా.  ఈ క్రమంలో అసలు ఏ బాలీవుడ్ హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు దీపికా పదుకోని బాలీవుడ్ లో హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్. త్వరలో తల్లి కాబోతున్న ఆమె రీసెంట్ గా ప్రభాస్ కల్కిలో కనిపించింది. ఆమె సినిమాలో తనకు ఎన్ని సీన్స్ ఉంటాయి. ఎంత ప్రయారిటీ ఉంటుంది. బ్యానర్ ఏమిటనేదాన్ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆ క్రమంలో ఆమె సినిమాకు  20 కోట్ల దాకా వసూలు చేస్తోందని తెలుస్తోంది. 
 

310

దీపికా పదుకోని తర్వాత ఆ స్దాయిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది అలియా భట్. ఆమె ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో సీతగా చేసింది. ఆమెకు 12 నుంచి 15 కోట్లు దాకా పే చేస్తున్నారని తెలుస్తోంది. ఆమె తమ సినిమాలో ఉంటే ఖచ్చితంగా మంచి బిజినెస్ అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఆమె ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి.
 

410

దీపిక,అలియా భట్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ కరీనా కపూర్. ఆమె బాలీవుడ్ హైయిస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లో ధర్డ్ ప్లేస్ లో ఉంటుంది. ఆమె 8–11 కోట్లు దాకా వసూలు చేస్తుంది. ఆమె ఈ మధ్యన క్రూ సినిమాలో చేసింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా 157 కోట్లు వసూలు చేసింది. సింగమ్ ఎగైన్ సినిమాలోనూ ఆమె కనిపించనుంది. 
 

510

ఆ తర్వాత లిస్ట్ లో బాలీవుడ్ హీరోయిన్స్ జాహ్నవి కపూర్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, భూమి పడ్నేకర్, దిశా పటాని, విద్యా బాలన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీతి సింగ్ ఉన్నారు. వీరందా దాదాపు 5 కోట్లు దాకా వసూలు చేస్తారు. అయితే ఆ ప్రాజెక్టు బట్టి ఆ రేటు డిమాండ్ చేయటం అనేది ఆధారపడి ఉంటుంది. 
 

610

మన హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత ఇక్కడ మంచి ఫామ్ లో ఉంది. అనారోగ్యం వల్ల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నప్పటికీ ఖుషి సినిమాతో సమంత పలకరించింది.  సిటాడెల్, చెన్నై స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఒక్కో సినిమాకు సమంత రూ.4కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 
 

710

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ నయనతార హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.   ఆమె జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో నటించినందుకు నయన్ ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఈ ముద్దుగుమ్మ చేసే తదుపరి చిత్రాలకు రెమ్యునరేషన్ ను భారీగా పెంచి అడుగుతోంది.
 

810

సుమారు 21 సంవత్సరాలుగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతోంది త్రిష. నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ లతో ప్రేక్షకులను ఈ అమ్మడు అలరించడమేకాదు.. రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటోంది. 
 

910

తమన్నా కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోంది. కీర్తి సురేష్ కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటోంది. 
 

1010

సౌత్ హీరోయిన్ల రెమ్యునరేషన్ జాబితా పరిశీలిస్తే వీరందరిలో నయనతార టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. స్టార్ హీరోకు సమానంగా ఆమె పారితోషికం ఉంటుంది. జవాన్ తర్వాత పారితోషికాన్ని మరింత పెంచింది. రూ.12 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image2
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image3
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved