MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా అంటే భయమేసింది, డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ తెలుగు స్పీచ్, ఏమన్నాడంటే?

సినిమా అంటే భయమేసింది, డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ తెలుగు స్పీచ్, ఏమన్నాడంటే?

David Warner First Telugu Speech: తెలుగు సినిమా అంటే భయం వేసిందన్నారు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఫస్ట్ టైమ్ టాలీవుడ్ స్క్రీన్ పై నటుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు డేవిడ్. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
David Warner

David Warner

David Warner First Telugu Speech:రాబిన్ హుడ్ సినిమాతో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించపోతున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్,  అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన వార్న‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని  లీగుల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అయితే చిత్రం ఏంటంటే.. ఈసారి  ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వార్న‌ర్ ను ఏ ఫ్రాంఛైజీ కొనలేదు.

దాంతో ఆయన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఈసారి ను ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వార్నర్ కనిపించడని తెలిసి ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు.  అయితే ఆయన ఆడియన్స్ కు మరింత చేరువయ్యేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదికూడా తనకు ఎంతో ఇస్టమైన టాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా న‌టించిన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వార్న‌ర్‌. 

25

ఇక రీసెంట్ గా రాబిన్ హుడ్  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్  హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్న‌ర్ వచ్చారు. ఆయన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసిన వార్నర్.. తెలుగులోనే ముగించారు.  న‌మ‌స్కారం అని ప‌ల‌క‌రించిన ఆయన.. సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేందుకు ముందుగా కాస్త టెన్ష‌న్ ప‌డ్డాననిఅన్నారు.

ఇక చాలా కాలంగా త‌న‌పై అంద‌రూ చూపిన ప్రేమ‌కు, తనకు ఇచ్చిన  మ‌ద్ద‌తుకి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు వార్నర్ .టాలీవుడ్‌లో న‌టించ‌డం పై మాట్లాడుతూ.. సినీమా అనగానే కాస్త భ‌య‌ప‌డ్డాను. కాని మూవీ టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ గా నిలిచారని  వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. 
 

35

ఇక రాబిన్ హుడ్ సినిమా గురించి మాట్లాడిన డేవిడ్.. ఈసినిమాతో మీ ఫ్యామిలీలో నన్ను చేర్చుకున్నారు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నాకు చాలా గౌరవంగా, ఆనందంగా అతనిపిస్తుంది అన్నారు. అంతే కాదు ఈసినిమా సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఈసినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. ఆ కష్టం వృదాపోదు.. మీకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు వార్నర్. 
 

45

ఇక వార్నర్ స్పీచ్ ముగించే టైమ్ కు దర్శకుడు  వెంకీ కుడుముల తెలుగులో ఏదైనా మాట్లాడాల్సిందిగా వార్నర్ ను కోరారు. దాంతో ఆయన చివరిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే డైలాగ్ చెప్పి.. అందరిని నవ్వించారు. ఇక వార్నర్ నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు నుంచి కూడా రాబిన్ హుడ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. మరి వారి అంచనాలు ఎంత వరకూ నిజం అవుతాయో చూడాలి.  
 

55

నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టించిన మూవీ రాబిన్ హుడ్‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈసినిమాను  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు.  వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న నితిన్.. ఈసినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈమూవీ మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image3
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved