MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dacoit Box Office: డెకాయిట్ 15 రోజుల కలెక్షన్లు, ఇంతగా పడిపోయిందా?.. అడవి శేష్‌కి గట్టి దెబ్బే

Dacoit Box Office: డెకాయిట్ 15 రోజుల కలెక్షన్లు, ఇంతగా పడిపోయిందా?.. అడవి శేష్‌కి గట్టి దెబ్బే

Dacoit Box Office: అడవిశేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `డెకాయిట్‌` మూవీ 15 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? సినిమా హిట్టా ఫట్టా అనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 25 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డెకాయిట్‌ బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌ బాక్సాఫీసు రిపోర్ట్

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా `డెకాయిట్‌` చిత్రంలో నటించారు. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వారాల క్రితం విడుదలైంది. మిశ్రమ స్పందన రాబట్టుకొని బాక్సాఫీసు వద్ద మాత్రం మంచి వసూళ్లని రాబడుతూ వస్తోంది. రెండో వారంలోనూ సత్తా చాటింది. ఈ క్రమంలో ఈ చిత్రం 15రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలి? సినిమా హిట్టా? ఫట్టా అనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డెకాయిట్‌ 15 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

డెకాయిట్‌ 15 రోజుల కలెక్షన్లు

`డెకాయిట్‌` మూవీ ఇప్పటి వరకు రూ.53కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఓవరాల్‌గా రూ.26కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ షేర్‌ని సాధించింది. ఇండియా వైడ్‌గా ఇది రూ.33కోట్ల నెట్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.13కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి 15వ రోజు 30లక్షల వరకు వసూళ్లు వచ్చినట్టు సమాచారం. మూడో వారంలోనూ ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం విశేషమనే చెప్పొచ్చు. ఈ శనివారం, ఆదివారం కూడా మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా ఇది లాంగ్‌ రన్‌లో రూ.55-58  కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది.

34
డెకాయిట్‌కి నష్టాలు తప్పవా?
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌కి నష్టాలు తప్పవా?

ఇక `డెకాయిట్‌` మూవీకి థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.31 కోట్లు. బ్రేక్‌ ఈవెన్ కావాలంటే రూ.32కోట్లు రావాలి. అంటే సుమారు రూ.65కోట్ల వరకు గ్రాస్‌ వసూలు చేయాలి. కానీ అంత వరకు వెళ్తుందా అనేది సమస్య. ఈ రెండు రోజుల్లో మరో యాభై లక్షల షేర్‌కి ఛాన్స్ ఉంది. కానీ వచ్చే వారం ఇది థియేట్రికల్‌గా క్లోజ్‌ కాబోతుందని చెప్పొచ్చు. ఇదే జరిగితే ఈ మూవీ ద్వారా దాదా ఆరేడు కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. ఇలానే అయితే `డెకాయిట్‌` ఫ్లాప్‌ జాబితాలో చేరిపోతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా విషయంలో సేఫ్‌గానే ఉన్నారు. రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్‌ని పొందారు. సినిమాని కొన్న బయ్యర్లే కొంత నష్టపోయే అవకాశం ఉంది. అయితే అడవి శేష్‌ మూవీ అంటే మినిమమ్‌ గ్యారంటీ, బయ్యర్లు సేఫ్‌లో ఉంటారని భావిస్తారు. కానీ మొదటిసారి ఆయన ఈ చిత్రంతో గట్టి దెబ్బతినబోతున్నట్టు తెలుస్తోంది.

44
డెకాయిట్ ఎలా ఉందంటే
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్ ఎలా ఉందంటే

డెకాయిట్‌ చిత్రంలో అడవిశేష్‌, మృణాల్‌తోపాటు అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. సుప్రియా యార్లగడ్డ నిర్మించారు. ఆమె సొంతంగా నిర్మాతగా మారి తీసిన చిత్రమిది. తాను ఎంతో ప్రేమించిన అమ్మాయి.. తన అన్నయ్య హత్యకేసులో రివర్స్ తిరిగి ప్రియుడినే జైలుకి పంపిస్తుంది. దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని జైలు నుంచి పారిపోయి వచ్చిన హీరో ఆమెలో ఏం చూశాడు? ఆమె కోసం ఎందుకు ప్రాణాలు వదిలేశాడనేది డెకాయిట్‌ కథ. ఈ మూవీ లవ్‌ స్టోరీ బాగానే ఉన్నా, యాక్షన్‌ సీన్లు ఆకట్టుకున్నా, ఎమోషనల్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image2
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image3
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Sameera Bharadwaj Remuneration: సింగర్‌ సమీరా భరద్వాజ్‌ ఒక్కో పాటకి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Boyapati Top 5 Movies: బోయపాటి శ్రీను టాప్‌ 5 మూవీస్‌.. తిరుగులేని స్టార్‌ డైరెక్టర్‌ని చేసింది ఈ ఒక్క హీరోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved