MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో మార్పులు కోరిన పవన్ ? అవి ఏంటంటే

‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో మార్పులు కోరిన పవన్ ? అవి ఏంటంటే

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. 

2 Min read
Author : Surya Prakash
Published : Sep 08 2024, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


దర్శకుడు హరీష్ శంకర్ రీసెంట్‌ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ఆయన ఇమేజ్ ని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ సినిమాతో ఏ తరహా అంశాలు ప్రేక్షకులు కోరుకుంటున్నారనే విషయంలో హరీష్ తడబడ్డారు. మారిన ప్రేక్షకుడుకి కావాల్సిన ఎలిమెంట్స్ అందించలేకపోయారు. హరీష్ మార్క్ పంచ్ లు కానీ ఫన్ సీన్స్ కానీ  సినిమాలో వర్కవుట్ కాలేదు.

 రీమేక్ లు చేయటంలో హరీష్ శంకర్ స్పెషల్ అనే ముద్ర ఈ చిత్రం తుడిచిపెట్టేసింది. దాంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న  ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 

26

 హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపైకి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తప్పిస్తే  ‘ఉస్తాద్ భగత్ సింగ్’షూటింగ్ జరిగింది లేదు. మేజర్ పోర్షన్ షూటింగ్ పెండింగ్ ఉంది. దాంతో ఇప్పుడు ఆయన స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నాయి.

కొన్ని కీలకమైన మార్పులు సెకండాఫ్ లో చేయబోతన్నారని వినికిడి. గత పది రోజులుగా తన టీమ్ తో హరీష్ కూర్చుంటున్నారట. రీసెంట్ గా అమెరికా వెళ్లిన ఆయన వచ్చాక మళ్ళీ స్క్రిప్ట్ పనిమీదే ఉంటారు. అక్టోబర్ నెలాఖరకు పూర్తి బౌండ్ స్క్రిప్టుతో పవన్ ని కలవబోతున్నారట. తను చేసిన మార్పులు చెప్పబోతున్నారట.  
 

36


అలాగే పవన్ సైతం తను ఇప్పుడు ఓ రాష్ట్రానికి డిప్యూటి సీఎం . ఇమేజ్ పూర్తిగా మారింది. తన మీద తీసే సన్నివేశాలు డైరక్ట్ గానో , ఇండైరక్ట్ గానో ప్రభుత్వానికి గుచ్చుకునేలా ఉండకూడదు. ఆ విషయంలో తను చేస్తున్న సినిమాల  స్క్రిప్టుల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

ఆ క్రమంలోనే హరీష్ ని మార్పులు చేయమని చెప్పారట. హరీష్ సైతం థేరీ రీమేక్ కాబట్టి ...ఆ ఛాయిలు లేకుండా కొత్త స్క్రిప్టులా చేయాలని భావిస్తున్నారు. అలాగని మిస్టర్ బచ్చన్ లా స్క్రిప్టు విషయంలో దెబ్బ తినకూడదనుకుంటున్నారట. 
  

46


పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో సినిమాల విషయంలో  మల్టిపుల్ గా ప్రొడక్షన్ డిలే లు ఎదుర్కొంటున్నారు. అయితే పవన్ తన వల్ల ఎవరూ నష్టపోకూడదని సినిమాలకు వీలు చూసుకుని సమయం కేటాయించి పెండింగ్ వర్క్ లు ఫినిష్ చేస్తామన్నారు. ఆయన షూటింగ్ కు డేట్స్ ఇవ్వటానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అభిమానులు సైతం త్వరలోనే ఆ సినిమాలు ప్లోర్ కు వెళ్తాయని భావిస్తున్నారు. 

56


ఏదైమైనా గబ్బర్‌ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ తేరీ సినిమాను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తోంది.  గబ్బర్ సింగ్‌ను మించేలానే ఉండబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్‌ వేయించారు కూడా. 

66

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నంవబర్ నుంచి  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు పవన్ కళ్యాణ్ 15 రోజులు డేట్స్ ను ఇచ్చారని, ఈ షెడ్యూల్ లోనే పవర్ స్టార్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతోంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved