‘పుష్ప 2’ నుంచి క్రేజీ అప్డేట్.. ఇదొక్కటి చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేందుకు!
‘పుష్ఫ : ది రైజ్’తో ఇండియాను షేక్ చేశారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం దీనికి సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్బంగా సినిమాపై వస్తున్న అప్డైట్స్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’(Pushpa). ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.
ఇప్పటికీ చిత్రంలోని పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు ఐకానిక్ డైలాగ్ ‘తగ్గేదే లే’(జుఖేగా నహీ) దేశ వ్యాప్తంగా వాడుకలోనే ఉంది. ఈ క్రమంలో ‘పుష్ఫ 2’ (Pushpa 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల క్రితమే సీక్వెల్ కు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తైయింది.
రీసెంట్ గా అల్లు అర్జున్, రష్మిక మందన్న పోస్టర్ డిజైన్స్ కోసం ఫొటోషూట్ ను కూడా పూర్తి చేశారు. ఇక అక్టోబర్ లోనే షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ కు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్ అల్లు అర్జున్ న్యూ పిక్ తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రివీల్ అయిన ఫొటోలో అల్లు అర్జున్ లుక్ వేరే లెవల్ లో ఉంది. స్టైలిష్ బియర్డ్ తో క్లాస్ అండ్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ ఫొటో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ అల్లు అర్జున్ కు సీన్ వివరిస్తున్నట్టు గా ఉంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
మరో ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తో థాయిలాండ్ లో సుకుమార్ పులితో ఓ సాలిడ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. థాయిలాండ్ లోని ఫారెస్ట్ ఏరియాలో ఈ సీన్ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించలేం అని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య ఇప్పటికే సీన్లు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
‘అల్లు స్టూడియో’లోనూ భారీ సెట్ వేయించినట్టు కూడా తెలుస్తోంది. ‘పుష్ఫ 2’లోని ఓ కీలక సన్నివేశాన్ని ఈ స్టూడియోలోనే చిత్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. ఏదేమైనా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, కేశవ, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.