- Home
- Entertainment
- Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
అనుపమా పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ నటించిన `క్రేజీ కళ్యాణం` చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది తెలుసుకుందాం.

ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా `క్రేజీ కళ్యాణం`
అనుపమా పరమేశ్వరన్, వీకే నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్(ఉడ్డెమారి) ప్రధాన పాత్రధారులుగా `క్రేజీ కళ్యాణం` మూవీ రూపొందింది. నూతన దర్శకుడు బద్రప్ప గాజుల దీనికి దర్శకత్వం వహించారు. యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పైగా `జైలర్ 2`, `రణబాలి`కి పోటీగా వచ్చింది. మరి బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుందా? డీలా పడింది? మొదటి రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.
క్రేజీ కళ్యాణం మూవీకి మొదటిరోజు కలెక్షన్లు
`క్రేజీ కళ్యాణం` మూవీ బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూస్తోంది. ఈ చిత్రానికి మొదటిరోజు టీ ఖర్చులు కూడా రాలేదు. ఈ సినిమా ఫస్ట్ డే కేవలం రూ.23లక్షల గ్రాస్‌ని కలెక్ట్ చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. అందులో సగం షేర్ అని చెప్పొచ్చు. అవి కేవలం థియేటర్ల రెంట్లకే వెళ్తాయి. నిర్మాతకు వచ్చేది జీరో. మిశ్రమ స్పందనతోనూ ఈ చిత్రానికి ఇంతటి దారుణమైన వసూళ్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. పండగ సీజన్లోనూ మరీ ఇంత తక్కువ రావడమే షాకిస్తోంది.
జైలర్ 2, రణబాలి మధ్య నలిగిపోయిన క్రేజీ కళ్యాణం
ఇదిలా ఉంటే `క్రేజీ కళ్యాణం` మూవీ మెయిన్‌గా అటు సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్ 2`, ఇటు విజయ్ దేరవకొండ, రష్మిక మందన్నాల `రణబాలి` చిత్రాల మధ్య నలిగిపోయిందని చెప్పొచ్చు. థియేటర్లు తక్కువగానే ఉన్నాయి. దీనికితోడు మిగిలిన రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ ఉంది. ముఖ్యంగా `జైలర్ 2` మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. మరోవైపు విజయ్ సినిమాకి కూడా టాక్ బాగుంది. దీంతో ఆ ప్రభావం క్రేజీ కళ్యాణంపై పడింది. ఈ సినిమా రెండింటి మధ్య నలిగిపోతుంది. అందుకే కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. అదే సోలోగా వచ్చి ఉంటే, ఇది డీసెంట్‌గానే ఆడేది, కలెక్షన్లు కూడా బాగుండేవి. మరి దసరా సెలవులు కావడంతో ఇకనైనా పుంజుకుంటుందేమో చూడాలి. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చే అవకాశం ఉంది.

