- Home
- Entertainment
- Crazy Kalyanam 4 Days Collections: క్రేజీ కళ్యాణం 4 రోజుల కలెక్షన్లు.. గట్టి పోటీలోనూ స్టడీగా వసూళ్లు
Crazy Kalyanam 4 Days Collections: క్రేజీ కళ్యాణం 4 రోజుల కలెక్షన్లు.. గట్టి పోటీలోనూ స్టడీగా వసూళ్లు
అనుపమా పరమేశ్వరన్, నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ నటించిన `క్రేజీ కళ్యాణం` మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో తడబడింది. మరి సినిమాకి వస్తోన్న కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

ఫ్యామిలీ డ్రామాగా క్రేజీ కళ్యాణం
అనుపమా పరమేశ్వరన్, వీకే నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్(ఉడ్డెమారి) ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం `క్రేజీ కళ్యాణం`. నూతన దర్శకుడు బద్రప్ప గాజుల దీనికి దర్శకత్వం వహించారు. యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. మరి వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.
క్రేజీ కళ్యాణం మూవీ 4 రోజుల కలెక్షన్లు
`క్రేజీ కళ్యాణం` మూవీ బాక్సాఫీసు వద్ద నిరాసంగా రన్ అవుతుంది. ఈ మూవీకి సోమవారం కేవలం రూ.17లక్షలు మాత్రమే రాబట్టింది. నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.84లక్షలు వసూలు చేసింది. ఈ దసరా స్పెషల్‌గా రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యంత డల్‌గా ఉన్నది ఈ సినిమా అనే చెప్పాలి. టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా నీరసంగా ఉంది. అయితే రోజువారి కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉండటం విశేషం. తెలంగాణ నేపథ్యంలో అమ్మాయి పెళ్లి చుట్టూ తిరిగే ఈ కథ ఫన్, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కానీ ఆశించిన స్థాయిలో ఫన్ వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ పండలేదు. అందుకే ఆడియెన్స్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. మరి ఫెస్టివల్ తర్వాత అయినా ఈ సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.
పోటీలో నలిగిపోయిన క్రేజీ కళ్యాణం
దీనికి తోడు పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో ఆ ప్రభావం `క్రేజీ కళ్యాణం`పై పడింది. రజనీకాంత్ `జైలర్ 2`, విజయ్ దేరవకొండ, రష్మిక మందన్నాల `రణబాలి` చిత్రాల మధ్య నలిగిపోయిందని చెప్పొచ్చు. సోలోగా వచ్చి ఉంటే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బెటర్‌గానే పర్‌ఫామ్ చేసేది. కానీ పోటీలో రావడంతో సత్తా చాటలేకపోయింది.

