కూలీ సినిమాకు షాక్, నిర్మాతలకు కోర్టులో ఎదురు దెబ్బ
‘కూలీ’ సినిమా నిర్మాతకు హైకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై వేసిన అఫీలుపై కోర్డు ఏమన్నదంటే?

రజినీకాంత్ ప్రధాన పాత్రలో, నాగార్జున విలన్ గా నటించిన సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ‘కూలీ’కి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిర్మాతలు సన్ పిక్చర్స్ హైకోర్టులో చాలెంజ్ చేశారు. ‘కూలీ’లో హింస తక్కువగా ఉందని, ‘యు/ఏ’ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. ‘ఏ’ సర్టిఫికెట్ వల్ల రజినీ అభిమానులైన పిల్లలు సినిమా చూడలేరని, ‘కేజీఎఫ్’, ‘బీస్ట్’లకు ‘యు/ఏ’ ఇచ్చారని పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు తరపున సుందరేశన్, హింసాత్మక సన్నివేశాలను తొలగించి, మళ్ళీ సెన్సార్‌కి పంపాలని సూచించారు. న్యాయమూర్తి సన్ పిక్చర్స్ అప్పీల్‌ను తిరస్కరించి కేసును కొట్టివేశారు. ‘కూలీ’ ‘ఏ’ సర్టిఫికెట్‌తోనే ప్రదర్శితమవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. దాంతో ఈసినిమా వసూళ్లపై అ ప్రభావం పెరిగే అవకాశం ఉంది.
భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమా యావరేజ్ టాక్ తో నడిచినా.. వసూళ్లు రాబడుతోంది. 14 రోజుల్లో ఈమూవీ 500 కోట్లు వసూలు చేసింది. లోకేష్ మునుపటి సినిమాల కంటే ‘కూలీ’ సినిమాపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు, నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్, ఉపేంద్ర, శృతి హాసన్ నటించారు.
కథ కొత్తగా లేకపోవడంతో కూలీ గత సినిమాలంత బాగాలేదని విమర్శలు వచ్చాయి. 500 కోట్ల వసూళ్లతో ‘విక్రమ్’, ‘లియో’ తర్వాత వరుసగా మూడోసారి 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శకుడిగా లోకేష్ నిలిచారు. ఇక ఈసినిమా ఫైనల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.