MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ ఛానల్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన పవిత్ర లోకేష్-నరేష్... తేడా కొడితే ఊచలు లెక్కపెట్టాల్సిందే! 

ఆ ఛానల్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన పవిత్ర లోకేష్-నరేష్... తేడా కొడితే ఊచలు లెక్కపెట్టాల్సిందే! 

నరేష్-పవిత్ర లోకేష్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలపై పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి మీద చర్యలు మొదలయ్యాయి. పవిత్ర లోకేష్ పిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలని కోర్ట్ ఆదేశించింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 12 2022, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Naresh Pavitra Lokesh

Naresh- Pavitra Lokesh

పవిత్ర లోకేష్-నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నరేష్ మీడియా ముందు నేరుగా తెలియజేశారు. మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. 
 

26
Naresh- Pavitra Lokesh

Naresh- Pavitra Lokesh

పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ని నరేష్ వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయం సందర్శించిన ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. 
 

36


వరుస కథనాల నేపథ్యంలో నరేషన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మాకు పెళ్లి జరగలేదు. అలాగే నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. ప్రతి పది జంటల్లో 8 జంటలు విడిపోతున్నారు. ఒక నమ్మకమైన మనిషి తోడు కావాలి. పవిత్ర లోకేష్-నేను కలిసి ఉంటున్నాము. భవిష్యత్ లో వివాహం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు అన్నాడు. 

46

నరేష్(Naresh)-పవిత్రల బంధాన్ని మూడో భార్య రమ్య రఘుపతి తప్పుబట్టారు. అధికారికంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం అక్రమం అంటూ ఆమె ధ్వజమెత్తారు. నరేష్ పై ఆమె న్యాయపోరాటం చేస్తున్నట్లు సమాచారం. 

56


కాగా తమ పై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. నిరాదరణ కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారిస్తున్న నాంపల్లి కోర్టు... సైబర్ పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదు ఆధారంగా ఛానల్స్ పై విచారణ చేపట్టాలని సూచించారు. 

66


ఈ క్రమంలో  రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్‌ ఇన్స్‌పిరేషన్‌, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చారు. వీరిపై విచారణ జరగనుంది. ఈ దుష్ప్రచారం వెనుక రమ్య రఘుపతి హస్తం ఉందన్న పవిత్ర లోకేష్ కంప్లైంట్ లో ఆమె పేరు కూడా పొందుపరిచారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image2
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Recommended image3
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved