500 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో మల్లీస్టారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Coolie OTT: రజనీకాంత్- నాగార్జున కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో రిలీజ్ అయి ₹500 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

రజనీ - నాగ్ మాస్ కాంబో
Coolie OTT: తలైవర్ రజనీకాంత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నాగార్జున విలన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోరుతో డిజిటల్ వేదికకు అడుగుపెట్టింది. మల్టీ స్టారర్ కూలీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘కూలీ’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని బుధవారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులందరికీ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. అయితే, కూలీ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కావడం విశేషం.
కూలీ సోర్టీ
కూలీ కథ విషయానికి వస్తే.. విశాఖపట్నం డాక్స్ నేపథ్యంగా సాగుతుంది. దేవ అనే మాజీ కూలీ, తన స్నేహితుడి అనుమానాస్పద మరణం వెనుక ఉన్న స్మగ్లింగ్ సిండికేట్‌ను బట్టబయలు చేయడానికి రెబల్‌గా మారతాడు. న్యాయం కోసం పోరాటం, బతుకుదెరువు, తిరుగుబాటు అన్నీ కలిపి యాక్షన్-డ్రామాగా తెరకెక్కించారు. రజనీకాంత్ దేవా పాత్రలో స్క్రీన్‌పై మాస్ ప్రభావం చూపిస్తే.. నాగార్జున విలన్ “సైమన్”గా పవర్ పుల్ పాత్రలో కనిపించారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎక్స్ ట్రా హైలైట్.
బాక్సాఫీస్ కలెక్షన్స్ – భారీ వసూళ్లు:
రజనీకాంత్ – నాగార్జున మాస్ కాంబినేషన్‌కి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన కూలీ, భారత్‌లో ₹284.47 కోట్లు నెట్ కలెక్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా ₹514.65 కోట్ల గ్రాస్ సాధించింది. మాస్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సెప్టెంబర్ 11 అర్థరాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మల్లీ స్టారర్ మూవీ ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లలో సినిమా లవర్స్‌కి ఎంటర్టైన్‌మెంట్ ఫుల్ డోస్ సిద్ధమయ్యింది.