స్టార్ లేడీ త్రిష జీవితాన్ని కుదిపేసిన వివాదాలు! ఈ జనరేషన్ కి తెలియని నిజాలు!
త్రిష జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్రిష జీవితంలోని అతిపెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం...
త్రిష అద్భుతమైన నటి. భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. 2002లో మౌనం పెసియాదే చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులో త్రిష ఫస్ట్ మూవీ మనసు మాట వినదు. రెండో చిత్రం వర్షం... బ్లాక్ బస్టర్ కొట్టింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో మరో బ్లాక్ బస్టర్. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్థిరపడిపోయింది. ఆమె పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. ఇప్పటికీ స్టార్స్ పక్కన నటిస్తూ సత్తా చాటుతుంది.
నటిగా త్రిష తిరుగులేని ఫేమ్ అనుభవించారు. అనేక మైలురాళ్ళు చేరుకున్నారు. అదే సమయంలో త్రిష వివాదాల్లో చిక్కుకున్నారు. త్రిష జీవితంలో ఉన్న అతిపెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం. త్రిష హీరోయిన్ అయ్యాక ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు. అయినప్పటికీ ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న ఆ వీడియో నాది కాదని త్రిష ఖండించారు. ఈ ఘటన సంచలనం రేపింది.
హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లీ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచిందంటూ కథనాలు వెలువడ్డాయి. చాలా కాలం తర్వాత త్రిష-విజయ్ లియో మూవీలో తిరిగి నటించారు.
Controversies in Trisha Krishnan career
సుచీ లీక్స్ కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం. సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్లో ధనుష్, త్రిష, అనిరుధ్ , ఆండ్రియా, రానా ప్రైవేట్ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ధనుష్-త్రిష బెడ్ పై పడుకుని ఉన్న ఫోటో వైరల్ గా మారింది. సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించారు. ఆ లీక్స్ వెనుక తన హస్తం లేదన్నారు.
సుచీ లీక్స్ లో రానా-త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో సైతం వెలుగులోకి వచ్చింది. సదరు ఫోటోలో రానా ఆమెను కిస్ చేస్తున్నారు. రానా-త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు తదనంతరం వార్తలు వచ్చాయి. రానాకు పెళ్లి కుదరగా... త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా అతన్ని టార్గెట్ చేస్తూ అనుమానస్పద కామెంట్స్ చేసింది.
త్రిష సౌత్ ఇండియా పెటా(PETA) బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు. ఈ విషయంలో తమినాడు ప్రజల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి. వెనక్కి తగ్గిన త్రిష జల్లికట్టుకి మద్దతు ప్రకటించింది.
వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది. అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసింది. ఇందుకు కారణాలు తెలియరాలేదు. త్రిష నటుడు శింబుతో ఎఫైర్ నడిపారనే వాదన కూడా ఉంది.
త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. కానీ లియో సెట్స్ లో ఆమెను నాకు కనీసం చూపించలేదని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ మద్దతు తెలిపారు.
బహిష్కృత అన్నాడీఎమ్కే నాయకుడు ఏవీ రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశాడు. రూ. 25 లక్షలు తీసుకుని ఓ ఎమ్మెల్యేతో త్రిష రాత్రంగా గడిపింది. అందుకే నేనే సాక్ష్యం అన్నాడు. ఏవీ రాజుపై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది.