`పవర్ స్టార్` వివాదంలో ట్విస్ట్: ప్లేటు ఫిరాయించిన శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కొద్ది రోజులుగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో ఉండేది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమా వివాదంలో శ్రీరెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. దీంతో శ్రీ రెడ్డి ఈ వివాదంపై తనదైన స్టైల్‌లో స్పందించింది.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మలకు మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే కొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి, తాజాగా వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన పరన్నాజీవి సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది.
కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి పరాన్నజీవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాను వర్మకు వ్యతిరేకంగా పవన్ అభిమానులు రూపొందిస్తున్నారు.
అయితే ఈ వార్తలను శ్రీ రెడ్డి ఖండించింది. తాను ఆ సినిమాలో నటించటం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీరెడ్డి వర్మను ప్రేమిస్తున్న కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.
అంతేకాదు ఇటీవల వర్మ రిలీజ్ చేసిన పవర్ స్టార్ సినిమాలోని పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా ఆమె ఆర్జీవీకి శుభాకాంక్షలు తెలియజేసింది.
పరాన్నజీవి సినిమాలో శ్రీరెడ్డితో నటింప చేసేందుకు చాలా ఒత్తిడి చేశారట. కేవలం డబ్బుకోసం అయితే అందుకు నాకు చాలా దార్లు ఉన్నాయి. కానీ డబ్బు కోసం నాకు నచ్చిన వారితో రిలేషన్ పాడు చేసుకోను అంటూ ఆర్జీవీని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.
ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి, తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.