‘కమిటీ కుర్రోళ్ళు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్ట్నైమెంట్ ని ఇచ్చి , ప్రేక్షకుల్ని బాల్యానికి తీసుకెళ్లిన ఈ చిత్రం త్వరలో ఈ టీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Committee Kurrollu , OTT , ETV Win, premiere date
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.
ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే 3 కోట్లు తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 20 కోట్లు దాకా వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ‘ఈటీవీ విన్’ (ETV Win)లోకి రానుంది. ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది ఓటీటీ సంస్థ.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుంది.
కథ :
కమిటీ కుర్రోళ్ళు చిత్ర కథ విలేజ్ నేపథ్యంలో సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పురుషోత్తపల్లి అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 12 ఏళ్ళకి ఒకసారి జాతర జరగడం సాంప్రదాయం. ఆ ఊర్లో శివ( సందీప్ సరోజ్), సూర్య( యాశ్వంత్ పెండ్యాల),సుబ్బు ( త్రినాథ్ వర్మ) , విలియమ్ (ఈశ్వర్ రాచిరాజు), పెద్దోడు( ప్రసాద్ బెహరా) మంచి స్నేహితులుగా ఉంటారు. జాతరలో ఆత్రం అనే యువకుడు మరణిస్తాడు. దీనితో ఊర్లో ఒక్కసారిగా ఘర్షణలు మొదలవుతాయి.
జాతర సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయితీలో ఊరి పెద్దలు తీర్పునిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? పన్నెండేళ్ల క్రితం కులాల గొడవ వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటయ్యింది? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నది మిగిలిన కథ.
పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను చూపిస్తుుంది ‘కమిటీ కుర్రోళ్ళు’ . ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేసారు.
మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.
కమిటీ కుర్రోళ్ళు చిత్రం విషయంలో ముందుగా మార్కులు వేయాల్సింది దర్శకుడు యదు వంశీకే. ఆయన సిద్ధం చేసుకున్న కథ, డైలాగులు, విలేజ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుకోవడం ప్రతి అంశం వర్కౌట్ అయింది.
కథలో హ్యూమర్ ని, భావోద్వేగాల్ని, రాజకీయ అంశాలని, స్నేహాన్ని, సందేశాన్ని, రిజర్వేషన్స్ అంశాన్ని మిక్స్ చేయడం చాలా బావుంది. దీపక్ దేవ్ అందించిన సంగీతం కూడా బావుంది. ఇక కెమెరా మెన్ గోదావరి అందాలు చూపిస్తూ మంచి విజువల్స్ రాబట్టారు. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఒక్కటే మైనస్.