MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సునీల్ స్టార్ అయ్యాక కారు కొనాలని ఉంది అని చెబితే.. ఆటో కొనుక్కో అంటూ స్టార్ హీరో పెదనాన్న వెటకారంగా..

సునీల్ స్టార్ అయ్యాక కారు కొనాలని ఉంది అని చెబితే.. ఆటో కొనుక్కో అంటూ స్టార్ హీరో పెదనాన్న వెటకారంగా..

కమెడియన్ గా గుర్తింపు వచ్చాక హీరో కావడం సాధారణ విషయం కాదు. కానీ సునీలీ అది చేసి చూపించాడు. కమెడియన్ గా సునీల్ కి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. హీరోగా కూడా సునీల్ కెరీర్ ఆరంభం అదిరింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 04 2024, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sunil

Sunil

కమెడియన్ గా గుర్తింపు వచ్చాక హీరో కావడం సాధారణ విషయం కాదు. కానీ సునీలీ అది చేసి చూపించాడు. కమెడియన్ గా సునీల్ కి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. హీరోగా కూడా సునీల్ కెరీర్ ఆరంభం అదిరింది. కానీ ఆ తర్వాత ట్రాక్ తప్పింది. సునీల్ హీరోగా మర్యాద రామన్న, పూలరంగడు, అందాల రాముడు, మిస్టర్ పెళ్లి కొడుకు  లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సునీల్ ని ఫ్లాప్ మూవీస్ వెంటాడాయి. 

25
Actor Sunil

Actor Sunil

ఇప్పుడు సునీల్ తిరిగి క్యారెక్టర్ రోల్స్, కామెడీ రోల్స్ తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి సునీల్ ప్రయాణం టాలీవుడ్ లో మొదలయింది. వీళ్ళిద్దరూ రూమ్ మేట్స్. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే లాంటి చిత్రాలు సునీల్ ని కమెడియన్ గా స్టార్ ని చేశాయి. వీటిలో ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా పని చేసిన చిత్రాలు ఉన్నాయి. త్రివిక్రమ్ కామెడీ పంచ్ లు సునీల్ నోట అద్భుతంగా పేలేవి. 

Also Read : అందువల్లే చిరంజీవి మూవీ డిజాస్టర్ అని ముద్ర వేశారు, పుండు మీద కారంలా ఆ రెండు చిత్రాలు.. కానీ ఏం జరిగిందంటే

35

సునీల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటి వరకు సునీల్ కి కారు లేదు. స్టార్ కమెడియన్ అయ్యాక కారు కొనాలని అనిపించిందట. ఎలాంటి కారు కొంటే బావుంటుంది.. ఎవరినైనా సలహా తీసుకుందాం అనుకున్నాడట. తన బడ్జెట్ కి తగ్గట్లుగా ఐ 10 కారు కొనాలని అనుకున్నాడు. ప్రముఖ నిర్మాత, హీరో రామ్ పోతినేని పెదనాన్న అయిన స్రవంతి రవి కిషోర్ కి ఈ విషయం చెప్పారట. సార్ నేను ఐ 10 కారు కొనాలని అనుకుంటున్నా అని చెప్పారట. 

45

స్రవంతి రవికిశోర్ వెంటనే.. ఐ 10 కొంటావా.. ఆటో కొనేసుకో బావుంటుంది అని వెటకారంగా అన్నారట. అదేంటి సార్ అని అడిగితే.. ఆయన ఇచ్చిన సమాధానం విని సునీల్ షాక్ అయ్యాడు. నీది మామూలు పర్సనాలిటీ కాదు(అప్పట్లో సునీల్ బాగా బొద్దుగా ఉండేవారు).. కనీసం సీటు దగ్గర నీ కాళ్ళు కూడా సరిగ్గా పట్టవు ఐ 10 కారులో.. దానికన్నా ఆటో సౌకర్యంగా ఉంటుంది అని చెప్పారట. పైగా నువ్వు ఏదో ఒక లగేజ్ తో తిరుగుతుంటావు. కాబట్టి ఐ10 వద్దు.. కాస్త డబ్బు ఎక్కువైనా మంచి కారు కొనుక్కో అని చెప్పారట. ఆయన సలహా మేరకు సునీల్ హుండాయ్ ఎక్సెంట్ టొర్నాడో అనే కారు కొనుక్కున్నారు. తాను కొనుక్కున్న ఫస్ట్ కారు అదే అని సునీల్ తెలిపారు. 

55

సునీల్, త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్ మధ్య మంచి అనుబంధం ఉంది. స్రవంతి రవికిశోర్ చిత్రాల ద్వారానే త్రివిక్రమ్, సునీల్ ఇద్దరికీ లైఫ్ వచ్చింది. నువ్వే కావాలి, నువ్వు నాకు, నచ్చావ్, నువ్వే నువ్వే ఇలా స్రవంతి రవికిశోర్ నిర్మించిన అనేక చిత్రాల్లో సునీల్ నటించారు.  నువ్వే నువ్వే, ఆంధ్రుడు, మర్యాద రామన్న చిత్రాలకు సునీల్ నంది అవార్డులు గెలుచుకున్నారు. అనేక ఫిలిం ఫేర్ అవార్డులు కూడా లభించాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved