MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రఘుబాబు ఆశపడి అమరావతిలో 15 ఎకరాలు కొన్నాడు.. మొత్తం పడిపోయింది, కమెడియన్ పృథ్వీ షాకింగ్ కామెంట్స్

రఘుబాబు ఆశపడి అమరావతిలో 15 ఎకరాలు కొన్నాడు.. మొత్తం పడిపోయింది, కమెడియన్ పృథ్వీ షాకింగ్ కామెంట్స్

కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి.

Sreeharsha Gopagani | Published : Oct 31 2023, 09:13 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. 

 

26
Asianet Image

కానీ మహిళతో పృథ్వి జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ చిక్కుకోవడం అతడికి సమస్యలు తెచ్చిపెట్టింది. చైర్మన్ పదవిని కుఆ పృథ్వీ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పృథ్వీ జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారారు.

36
Asianet Image

కమెడియన్ పృథ్వీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పృథ్వీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని భూముల విషయంలో పృథ్వీ ఉదాహరణగా చెబుతూ ఒక ఆసక్తికర విషయం బటయపెట్టారు. 

46
Asianet Image

అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ పలువురు వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు కోట్ల రూపాయలతో భూములు కొన్నారు. అందులో ప్రముఖ నటుడు రఘుబాబు కూడా ఉన్నారట. రఘుబాబు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా రాణిస్తున్నారు. ఆయన గళమే రఘుబాబుకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. 

56
Asianet Image

రఘుబాబు అమరావతిలో అందరిలాగే ఆశపడి 15 ఎకరాలు కొన్నారట. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు మరో కోకాపేట అవుతుంది.. భూముల వ్యాల్యూ ఎక్కడికో వెళుతుంది అని అన్నారు. ఇప్పుడు ఏమైంది అంటూ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్యూ మొత్తం పడిపోయింది. 

66
Asianet Image

వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ అమరావతే రాజధానిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం.. అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది. ఏపీ పరిస్థితి చూస్తే బాధేస్తోంది. ప్రస్తుతం అమరావతి రైతులు దిక్కుతోచని స్థితిలో అడుక్కుంటున్నారు అంటూ పృథ్వీ అన్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories