- Home
- Entertainment
- ఆ హీరో కాదు నాకు పవన్ అంటేనే ఇష్టం.. రాజకీయాల నుంచి బయటకి వచ్చాక అలీ సంచలన కామెంట్..
ఆ హీరో కాదు నాకు పవన్ అంటేనే ఇష్టం.. రాజకీయాల నుంచి బయటకి వచ్చాక అలీ సంచలన కామెంట్..
గతంలో అలీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య విమర్శలు కూడా జరిగాయి.

ఏపీలో వైసీపీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. కూటమి ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అలీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గతంలో అలీ వైసీపీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు.
కానీ ఇకపై తాను రాజకీయాల్లో కొనసాగడం లేదని అలీ ప్రకటించారు. ఎప్పటిలాగే సినిమాలు,షోలతో బిజీ అయ్యారు. గతంలో అలీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య విమర్శలు కూడా జరిగాయి.
రాజకీయాల నుంచి బయటకి వచ్చిన తర్వాత అలీ తొలిసారి పవన్ కళ్యాణ్ గురించి ఒక షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమ అడ్డా షోకి అలీ అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో సుమతో పాటు యాంకర్ సౌమ్య రావు, సిరి హనుమంత్, శ్రీహాన్ పాల్గొన్నారు.
అటువైపు అలీ, ఇటువైపు సుమని పెట్టుకుని సౌమ్య రావు బూతులతో రెచ్చిపోవడం ఆందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలీ సౌమ్యరావుపై సెటైర్లు వేశారు. పాప కర్ణాటక నుంచి వచ్చింది. కాబట్టి తెలుగు కన్ఫ్యూజ్ అవుతోంది అని చెప్పారు. నాకు తెలుగు బాగా వచ్చు. కానీ లింగ కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పింది. దీనితో అలీ, సుమ ఆశ్చర్యంగా చూస్తూ పగలబడి నవ్వారు.
మీరు అనుకుంటున్న లింగ కాదు.. స్త్రీలింగం, పురుష లింగం అని తెలిపింది. దీనితో అలీ ఆ లింగానా అంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత సిరి, సౌమ్య రావు కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళలుగా స్కిట్ చేశారు. అక్కడ అసలు కుళాయి ఏది అని సౌమ్య అడిగింది. ఈవిడకి అన్ని సెటప్ చేసి పెట్టాలి అని నవ్వేసింది. దీనికి సౌమ్య బదులిస్తూ మీకంటే సెటప్ ఉన్నారు.. నాకెక్కడ అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేసింది.
ఇద్దరూ నీళ్ల కోసం గొడవ పడతారు. ఈ కుళాయి పెట్ట్టిందే నా భర్త అని సౌమ్య రావు అంటుంది. ఎక్కడ నీ భర్త అని సిరి అడుగుతుంది. ఆ భర్త ఇక్కడ కుళాయి పెట్టి వేరే పొలంలో.. అంటూ పచ్చిగా మాట్లాడింది.
సుమ, సౌమ్య రావు, సిరి ముగ్గురూ సరదాగా ఊ అంటావా మావ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. ఇక సుమ అలీని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్న వైరల్ గా మారింది. ఆన్ స్క్రీన్ లో ఈ హీరోల్లో ఎవరితో కాంబినేషన్ అంటే మీకు ఇష్టం అని సుమ అడిగింది. రవితేజ, పవన్ కళ్యాణ్ అని ఆప్షన్స్ ఇచ్చింది. అలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్ తో కాంబినేషన్ అంటే తనకు ఇష్టం అని తెలిపారు.