వేణు స్వామి పరువు తీశారా ?.. హీరోయిన్ రాశి, కమెడియన్ అలీ, కస్తూరి అందరూ కలసి ఇలా
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
తాను చెప్పిన జ్యోతిష్యంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ వేణు స్వామి దానికి కూడా కన్విన్సింగ్ గా వివరణ ఇవ్వగలరు. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, సమంత, నయనతార ఇలా బడా సెలెబ్రిటీల జాతకాల గురించి వేణు స్వామి చేసే వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుంటాయి. వేణు స్వామికి సోషల్ మీడియాలో నెగిటివిటి కూడా ఎక్కువగానే ఉంటుంది. తరచుగా ఆయన ట్రోలింగ్ కి గురవుతుంటారు.
తాజాగా ఓ షోలో వేణు స్వామిని టార్గెట్ చేస్తూ సెటైర్ల వర్షం కురిపించారు. యాంకర్ గా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి.. ఫ్యామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం అనే షోలో పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ షోలో బిత్తిరి సత్తి వేణు స్వామి గెటప్ లో కనిపించాడు. నా పేరు 'వేలు స్వామి' అంటూ బిత్తిరి సత్తి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ షోలో ఉన్న సెలెబ్రిటీలని ఎవ్వరిని వదల్లేదు. వేణు స్వామి తరహాలో ప్రతి సెలెబ్రిటీల దగ్గరకి వెళ్లి కాంట్రవర్సీ తరహాలో జ్యోతిష్యం చెబుతూ సత్తి నవ్వించాడు. ముందుగా అలీ దగ్గరకి వెళ్ళాడు. ఏపీలో మే నెలలో ఏం జరగబోతోందో చెబుతాను అని అన్నాడు. ఏదో సంచలన విషయం చెబుతాడు అని అలీ ఉత్కంఠగా ఎదురుచూశాడు. కానీ బిత్తిరి సత్తి.. ఏపీలో మే నెలలో ఇంకా ఎండలు బాగా పెరుగుతాయి అని చెప్పాడు. దీనితో అంతా నవ్వేశారు.
Venu Swamy
హీరోయిన్ రాశి దగ్గరకి వెళ్లి.. నేను ఇంతకు ముందే చెప్పా.. మీరు ఒక ప్రముఖ హీరో మీద చేయి వేసుకుంటారు అని అన్నాడు. అయ్యో నేను అలా చేయలేదు అండీ అని రాశి చెప్పింది. వేసుకున్నారు కదా అంటూ సత్తి ఓ వీడియో చూపించబోయాడు. బహుశా అది ఇటీవల వైరల్ అయిన శ్రీకాంత్ వీడియో అయి ఉంటుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆ తర్వాత కస్తూరి జాతకం చెప్పాడు. మీరు హీరోయిన్ గా నటించిన సినిమా త్వరలో రీ రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. ఆమె నేను నటించిన అంత సూపర్ హిట్ మూవీ ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండింది. అన్ని సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి.. అన్నమయ్య రీరిలీజ్ కాకూడదా అని సత్తి ప్రశ్నించాడు. వేణు స్వామి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తూ కామెడీగా జాతకాలు చెబుతూ బిత్తిరి సత్తి నవ్వించాడు. నెటిజన్లు కొందరు.. వేణు స్వామిని టార్గెట్ చేసి పరువు తీసారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.