MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Colors Swathi: సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఇంతకీ ఎవరతను

Colors Swathi: సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఇంతకీ ఎవరతను

Colors Swathi: అచ్చ తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి జీవితంలో రెండో ప్రయాణం మొదలు పెట్టింది. యంగ్ డైరెక్టర్ ను ప్రేమించి సీక్రేట్ గా రెండోపెళ్లి చేసుకుంది టాలీవుడ్ స్టార్ కలర్స్ స్వాతి అలియాస్ స్వాతిరెడ్డి. ఇంతకీ ఆమె పెళ్లాడిన యంగ్ డైరెక్టర్ ఎవరు.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 08 2026, 09:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండో సారి పెళ్లి పీటలెక్కిన కలర్స్ స్వాతి..
Image Credit : Asianet News

రెండో సారి పెళ్లి పీటలెక్కిన కలర్స్ స్వాతి..

తెలుగు టెలివిజన్ రంగంలో ‘కలర్స్’ అనే ఒకే ఒక్క షోతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి. ఆ తర్వాత వెండితెరపై కూడా ‘అష్టా చమ్మా’, ‘స్వామి రారా’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 

తాజాగా స్వాతి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆమె ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతి రెడ్డి దర్శకుడు, ‘మంథ్ ఆఫ్ మధు’ ఫేం శ్రీకాంత్‌ నగోటిను పెళ్లి చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దర్శకుడితో రెండో ప్రయాణం
Image Credit : Asianet News

దర్శకుడితో రెండో ప్రయాణం

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన క్రమంలోనే, యువ దర్శకుడు శ్రీకాంత్‌ నగోటితో స్వాతికి పరిచయం ఏర్పడింది. కథా చర్చలు, సినిమా ప్రయాణంలో వీరిద్దరి ఆలోచనలు, మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం చాలా నిశ్శబ్దంగా, ప్రైవేట్‌గా జరిగినట్లు సమాచారం. సంప్రదాయ పద్దతిలో పెళ్లి జరుగగా.. స్వాతి రెడ్డి తన భర్త చేయి పట్టుకున్న ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

34
మొదటి వివాహం.. విడాకులు
Image Credit : Asianet News

మొదటి వివాహం.. విడాకులు

స్వాతి 2018లో మలయాళీ అయిన వికాస్ వాసు అనే అంతర్జాతీయ పైలట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమై ఇండోనేషియాలో స్థిరపడ్డింది. అయితే, దురదృష్టవశాత్తూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా ఖాతాల నుండి భర్త ఫోటోలను తొలగించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాల నుండి కోలుకోవడానికి స్వాతి కొంత సమయం తీసుకున్నారు.

44
సినిమాల్లోకి రీ-ఎంట్రీ
Image Credit : our own

సినిమాల్లోకి రీ-ఎంట్రీ

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, స్వాతి ధైర్యంగా ముందడుగు వేశారు. మళ్లీ తన నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని 'పంచతంత్రం', 'మంత్ ఆఫ్ మధు' వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈసిమా టైమ్ లోనే ప్రేమలో పడ్డ స్వాతీ.. తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు స్వాతికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Recommended image2
Mahesh Babu: మరదలిని మోసం చేసిన మహేష్ బాబు .. నమ్రత, శిల్పల సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved