MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నందమూరి యువతరం మధ్య ఆధిపత్యపోరు, బాలయ్య-జూనియర్ ఎన్టీఆర్ లకు పరువు మేటర్!

నందమూరి యువతరం మధ్య ఆధిపత్యపోరు, బాలయ్య-జూనియర్ ఎన్టీఆర్ లకు పరువు మేటర్!

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు మోక్షజ్ఞ, ఎన్టీఆర్ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా ఉంది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 31 2024, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
NTR

NTR

బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ పీక్స్ కి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి. మోక్షజ్ఞకు పోటీగా అన్నయ్య కొడుకు ఎన్టీఆర్ ని దించాడన్న వాదన మొదలైంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్య చేసిన కుట్రకు బదులు తీర్చుకుంటున్నాడనే చర్చ తెరపైకి వచ్చింది. సరిగ్గా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అన్న కొడుకును దింపుతున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
NTR

NTR

హరికృష్ణ రెండో భార్య కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ వారసుడిగా అంగీకరించలేదని కొందరు అంటారు. అలాగే రాజకీయ కారణాలతో హరికృష్ణను బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే ఆలోచన చేశాడట బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా తారకరత్నను దించాడట. అప్పట్లో తారకరత్న లాంచింగ్ ఒక సెన్సేషన్. ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. తారకరత్న మొదటి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు 2002లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

37
NTR

NTR

అదే ఏడాది ఆది మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. జూనియర్ ఎన్టీఆర్ కి తారకరత్న ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయాడు. ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వొద్దని బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 

హరికృష్ణ టీడీపీకి దూరమయ్యాక జూనియర్ ఎన్టీఆర్-బాలకృష్ణ మధ్య సఖ్యత లేదు. హరికృష్ణ మరణం తర్వాత కూడా వారు కలవలేదు. భువనేశ్వరి పై వైసీపీ నేతల ఆరోపణలు, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వైఖరిని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ హాజరు కాలేదు. ఈ పరిణామాలతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. 
 

47
Mokshagna Nandamuri

Mokshagna Nandamuri

కాగా బాలయ్య-జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ పీక్స్ చేరిందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. గతంలో బాలయ్య చేసిన కుట్రకు జూనియర్ ఎన్టీఆర్ బదులు తీర్చుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. మోక్షజ్ఞకు పోటీగా అన్న కొడుకుని బరిలో దింపుతున్నాడట. నందమూరి వంశంలోని నాలుగో తరం వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకిరామ్ కొడుకు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ యంగ్ హీరో పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. యంగ్ ఎన్టీఆర్ పక్కా హీరో మెటీరియల్. మాస్ అప్పీల్ కలిగి ఉన్నాడు. ఏ మాత్రం టాలెంట్ చూపించినా హీరోగా రాణించడం ఖాయం. 
 

57
NTR

NTR

మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. కాబట్టి మోక్షజ్ఞ వర్సెస్ యంగ్ ఎన్టీఆర్ అన్నట్లు పరిస్థితి తయారైంది. అటు బాలయ్య వారసుడు ఇటు జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు. ఎవరు సత్తా ఏమిటో తేల్చుకుందాం రండి అన్నట్లుగా ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ తమ వారసులను కోడిపుంజులు మాదిరి బరిలో దించుతున్నారు. 
 

67

ఇక నందమూరి ఫ్యాన్స్ ఎటువైపు అనే సందేహం అందరిలో ఉంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన నందమూరి ఫ్యాన్స్ తమ తమ వర్గపు హీరోకి మద్దతు తెలుపుతారు. ఇప్పుడు బాలయ్యకు మించిన ఫేమ్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. కాబట్టి జానకిరామ్ కొడుకు యంగ్ ఎన్టీఆర్ ని తక్కువ అంచనా వేయలేం. ఆయనకు నందమూరి అభిమానుల మద్దతు దొరకదని చెప్పలేం. 

 

77
NTR

NTR

అయితే మోక్షజ్ఞకు ఓ అడ్వాంటేజ్ ఉంది. ప్రశాంత్ వర్మ ఫార్మ్ లో ఉన్న ఈ తరం దర్శకుడు.. మోక్షజ్ఞకు మంచి మూవీ ఇచ్చే ఆస్కారం ఉంది. ఇటు వైపేమో ఫేడ్ అవుట్ అయిన అవుట్ డేటెడ్ వైవిఎస్ చౌదరి. ఎన్టీఆర్ కుటుంబం మీద అభిమానం తప్పితే, మంచి కంటెంట్ తో మూవీ తీస్తాడనే నమ్మకం లేదు. ఇక చూడాలి మోక్షజ్ఞ, యంగ్ ఎన్టీఆర్ లలో ఎవరిది పై చేయి అవుతుందో.. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved